Let's talk: editor@tmv.in
దమ్ముంటే రాజీనామా చేసి గెలువండి!

దమ్ముంటే రాజీనామా చేసి గెలువండి!

Gaddamidi Naveen
14 సెప్టెంబర్, 2025

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‏లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‏రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్పై మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‏లో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలో స్థానిక ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలకు తెరలేపారని ఫైర్ అయ్యారు.

ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడంతో తను బీఆర్ఎస్ లో ఉన్నాను అని చెప్పే సమాధానం సరైనది కాదు. ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ నికు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బిఫాం తీసుకొని పోటీచేయు. ప్రజలు నిన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేను చేశారు అని చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి చుపియూ అని బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‏రెడ్డి అన్నారు. రాష్ర్టంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని తోకల శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే అదే పార్టీలోకి మారడం ప్రకాష్గౌడ్కు అలవాటుగా మారిందన్నారు.

గతంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతూ తన ఆస్తులను వ్యాపారాలను, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.మీరు పార్టీ మారకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేశారని, ఇది నిజం కాదాని మండిపడ్డారు. ప్రకాష్ గౌడ్ నితి లేని రాజకీయాలు చేస్తున్నారు .రాన్నున రోజులో మీకు రాజకీయ భవిష్యత్ ఉండదు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మూడు నెలల సమయం పూర్తికావస్తున్న తరుణంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందన్నా రు. కాంగ్రెస్ లో చేరినట్లు చెప్పుకోలేని పరిస్థితి ప్రకాశ్గౌడ్కు దాపురించిందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు.

దమ్ముంటే రాజీనామా చేసి గెలువండి! - Tholi Paluku