Let's talk: editor@tmv.in
మ్యాన్ హోల్ బాద్యులపై చర్యలకు ఆదేశం

మ్యాన్ హోల్ బాద్యులపై చర్యలకు ఆదేశం

Gaddamidi Naveen
14 సెప్టెంబర్, 2025

హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించిన విషయం తెలిసిందే.ఈ విషాదకర సంఘటనపై, కమిషనర్ రంగనాథ్ మ్యాన్ హోల్ ఘటనకు హైడ్రా పూర్తిగా బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ప్రాథమిక విచారణ నిర్వహించి మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ఛార్జి బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని గుర్తించామన్నారు.

ఈ విషదకర ఘటనకు కారణమైన బాద్యుల పై చర్యలకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్న సమగ్ర సమాచారం తీసుకున్న ఆయన డీఆర్ఎఫ్ సూపర్వైజర్లు ఇద్దరు, వర్షాకాల అత్యవసర బృందాల సిబ్బంది ఇద్దరి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు నగరంలో జరుగుతే అధికారుల పై చర్యలు తిసుకుంటాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ మూత వేయకపోవడంతో ఆ చిన్నారి పడిపోయిందన్నారు.

అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించిన రంగనాథ్ వ్యర్థాలు తొలగించిన చోట వెంటనే క్యాచ్పిట్ మూతలు పెట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా క్యాచ్పిట్, మ్యాన్హోళ్లపై మూతలు లేకుంటే జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మ్యాన్హోల్, క్యాచ్పిట్ల మూతలు తెరిచి ఉంటే 90001 13667 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని నగరవాసులను కమిషనర్ రంగనాథ్ కోరారు.

మ్యాన్ హోల్ బాద్యులపై చర్యలకు ఆదేశం - Tholi Paluku