Let's talk: editor@tmv.in
గంటా మళ్ళా ఫామ్ లోకి వచ్చారా?

గంటా మళ్ళా ఫామ్ లోకి వచ్చారా?

FL - SIMHCLM
14 సెప్టెంబర్, 2025

సీనియర్ ఎమ్మెల్యే.. అన్నిపార్టీల్లోనూ లింకులు మెంటైన్ చేస్తూ అందరికీ కావాల్సినవాడుగా ఉంటూ వస్తున్నా గంటా శ్రీనివాస్ ఎప్పుడూ అధికారపార్టీలోనే ఉంటారు.అధికారం వస్తుందన్న పార్టీతోనే అంటకాగుతారు.అయితే అయన మంత్రిగా కాకుండా వట్టి ఎమ్మెల్యేగా ఉండాలంటే ఇష్టం ఉండదు. ఉంటె అధికారపార్టీలో ఉండాలి. మంత్రిగా ఉండాలి అంతేకానీ గుంపులో గోవిందలా ఉండడం ఆయనకు ఇష్టం ఉండదు.అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేబినెట్లో స్థానం లేకపోవడంతో అయన కినుక వహించి అన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. పెద్దగా ఎక్కడా సౌండ్ చేయకుండా తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటడం.మంత్రులుగా చేరినవాళ్ల పెర్ఫార్మెన్స్ మీద చంద్రబాబులోని జనంలోనూ కొంత అసంతృప్తి ఉండడంతో మళ్ళా కేబినెట్లో మార్పులు ఉంటాయని సౌండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో గంటా మళ్ళా గళమెత్తుతున్నారు.ప్రతిపక్ష హోదా ఇవ్వలంటూ వైయస్ జగన్ చేస్తున్న డిమాండ్స్ ను గంటా అపహాస్యం చేస్తూ వై నాట్ 175 అని ఎన్నికలకు బయల్దేరి 11 సీట్లు తెచ్చుకున్న నీకెందుకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. దమ్ముంటే ఆ మేరకు సీట్లు తెచ్చుకోవాలి కదా అని ప్రతిదాడి చేస్తున్నారు.పనిలో పనిగా నేపాల్ నుంచి యాత్రికులను తీసుకొచ్చిన లోకేష్ ను ఆకాశానికి ఎత్తుకున్నారు. తాను ఉన్నానన్న సౌండ్ చేస్తూ బిగ్ బాస్ లోకేష్ దృష్టిలో పడాలని చూస్తున్నారు. అప్పుడైనా ఆయనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో కాస్త నోరు పెంచుతున్నారని టీడీపీ నాయకులూ లోలోన గుసగుసలాడుతున్నారు.

గంటా మళ్ళా ఫామ్ లోకి వచ్చారా? - Tholi Paluku