Let's talk: editor@tmv.in
మధ్యప్రదేశ్​ సీఎంకు తప్పిన ప్రమాదం

మధ్యప్రదేశ్​ సీఎంకు తప్పిన ప్రమాదం

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కు తృటిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. చంబల్​ అనకట్ట బ్యాక్​ వాటర్​ ప్రాంతంలోని గాంధీ సాగర్ ఫారెస్ట్​ రిట్రీట్​ లో ఏర్పాటు చేసిన హాట్​ ఎయిర్​ బెలూన్​ ప్రారంభం సమయంలో మంటలు ఎగసిపడటంతో అక్కడున్న ప్రజల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

శనివారం ఉదయం గాంధీసాగర్ ఫారెస్ట్ రిట్రీట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం హాట్ ఎయిర్ బెలూన్ను ప్రారంభించడానికి ముందుకు వెళ్లారు. అయితే బలమైన వేడి గాలుల కారణంగా బెలూన్​ పైకి ఎగరలేదు. దాని కింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం మోహన్​ యాదవ్​ ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.

ఇందుకు సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది. “ సీఎం ప్రమాదంలో పడ్డారు” అన్న వదంతులు వ్యాపించాయి. అధికారులు దీనిపై స్పందిస్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, బెలూన్​ ఎగరడానికి ముందు బర్నర్​ నుంచి మంటలు రావడం సహజమేనని స్పష్టం చేశారు. ప్రజల్లో ఆందోళన రేపిన ఈ ఘటనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో గందరగోళానికి తెరపడింది. దీంతో ప్రజల్లో ఉన్న గందరగోళానికి తెరపడింది. అయితే రిట్రీట్ కార్యక్రమమనేది మధ్యప్రదేశ్​ టూరిజంలో ప్రధానమైంది. ఇక్కడ పారా గ్లైడింగ్​, వాటర్ స్పోర్ట్​స్​, హాట్​ ఎయిర్ బెలూన్​ తదితర కార్యక్రమాలు ప్రసిద్ధి చెందాయి.

మధ్యప్రదేశ్​ సీఎంకు తప్పిన ప్రమాదం - Tholi Paluku