Let's talk: editor@tmv.in
మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

మేఘాలయ ప్రజలు ప్రేమగా ‘ఓల్డ్​ వార్​ హర్స్’​ గా పిలుచుకునే మాజీ సీఎం డీడీ లాపాంగ్ 93 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అంత్యక్రియలు నిర్వహించనుంది. అయితే ఈయన 1932లో ఏప్రిల్​ 10న జన్మించారు. ప్రస్తుతం లాంపాంగ్ కు ఆయన భార్య లిండాజోన్స్​, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నాలుగుసార్లు సీఎంగా

1972 లో జరిగిన ఎన్నికల్లో నాంగ్సో నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయఢంకా మోగించారు. అనంతరం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. 1992 నుంచి 2010 మధ్య దాదాపు నాలుగు సార్లు మేఘాలయ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2018లో నేషనల్ పీపుల్స్​ పార్టీలో చేరి ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. అయితే ఆయన సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. తన తల్లికి టీ స్టాల్​ లో సహయం చేశారు. కార్మికుడిగా, ఉపాధ్యాయుడిగా పని చేసి ఎందరికో ఆదర్శ ప్రాయంగా నిలిచారు. ఖాసీ ప్రాంతంలో ని ప్రజలు ఈయనను ఆప్యాయంగా బా. డీ.డీని పిలిచేవారు. ఖాసీ భాషలో అద్భుతంగా ప్రసంగించేవారు. అలాగే సహనశీల రాజకీయ వేత్తగా ఈశాన్య ప్రజలు ఆయనను గుర్తిస్తారు.

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత - Tholi Paluku