Let's talk: editor@tmv.in
విజయ్ బస్సుయాత్ర ప్రారంభం

విజయ్ బస్సుయాత్ర ప్రారంభం

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

తమిళ వెట్రి కళగం వ్యవస్థాపకుడు దళపతి విజయ్​ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రను ప్రారంభించారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర ఉండనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రారంభం తరువాత మొదటిసారిగా ప్రచారంలోకి దూకారు.

తిరుచ్చిలో ఘనస్వాగతం

ఈరోజు ఉదయం విజయ్​ చెన్నై నుంచి నేరుగా తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే పార్టీ అభిమానులు, కార్యకర్తలు, శ్రేణులతో పరిసరాలు సందడిగా మారాయి. విజయ్​ రావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండాలను ఊపుతూ, డప్పులు మోగిస్తూ కళాకారులు జోష్ నింపారు. అందిరికి అభివాదం చేస్తూ ప్రచార వాహనం ఎక్కారు. వచ్చినవారికి అభివాదం చేస్తూ, విజయ చిహ్నం చూపిస్తూ ముందుకు కదిలారు.

విజయ్ బస్సుయాత్ర ప్రారంభం - Tholi Paluku