
ఆదిత్య ఠాక్రేపై మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు
నిత్య వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ఫిషరీస్, ఫోర్ట్స్ శాఖ మంత్రి నితిశ్ రాణే. తాజాగా శివసేన(యూబీటీ) యువ నాయకుడు ఆదిత్య ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. ఆదివారం జరిగే ఇండియా–పాకిస్ఠాన్ మ్యాచ్ ను ఆదిత్య బురఖా ధరించి చూస్తారని పరిహసమాడారు. దాంతో పాటు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ కూడా కేకలు వేస్తారని ఎగతాళి చేశారు. అలాగే సంజయ్ రౌతుపై కూడా ఆదే రేంజ్ లో వ్యంగంగా మాట్లాడారు. ఆయన మెరైన్ డ్రైవ్ లో బ్లాక్ లో టికెట్లు అమ్ముతారని ఆరోపించారు. దీంతో శివసేన నాయకులు రాణే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీసీఐ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆదిత్య ఠాక్రే
దుబాయ్ లో జరుగుతున్న ఆసియాకప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న దుమారం రేగుతుంది. దీంతో శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కూడా తీవ్ర ఆరోపణలు చేశారు.బీసీసీఐ దేశ వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని, పాక్ తో ఆడాలన్న నిర్ణయం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే ప్రధాని మోదీపై ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం దాడిలో 26 మంది మరణించిన మళ్లీ వారితో ఏ విధంగా ఆడిస్తారని ప్రశ్నించారు. ఈ మ్యాచ్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రం అంతటా ‘సింధూర్’ పేరుతో నిరసనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రకటించారు.
