Let's talk: editor@tmv.in
రైళ్ళో సీటు ఖాళీగా ఉందని కాలు వేస్తే.. శిక్షే

రైళ్ళో సీటు ఖాళీగా ఉందని కాలు వేస్తే.. శిక్షే

Pinjari Chand
14 సెప్టెంబర్, 2025

రైళ్లలో ముందు సీటు ఖాళీగా ఉంటే హమ్మయా.. అంటూ కాళ్లు కాస్తంత ముందు సీటులో పెట్టుకుంటాం. అయితే ఇక నుంచి అది నడువదు. ఎవరైనా అట్ల చేస్తే ఇక నుంచి అధికారులు శిక్ష వేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవల దక్షిణ రైల్వే హెచ్చరించింది. అలాగే ఓ ప్రకటన కూడా జారీ చేసింది. అందులో ప్రయాణికులు చేసే ఇటువంటి మరిన్ని అనాగరిక చర్యలను కూడా కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోనుంది.

సీటు పట్టరాదు.. ఎంట్రెన్స్​ లో కూర్చోరాదు

రైలు ఎక్కిన వారిని కూర్చోనివ్వకుండా రైళ్లలో మా దోస్తు వస్తాడు, మా బంధువు వస్తాడు అని పక్కనోళ్లకు సీటు పట్టడం, బోగీ ఎంట్రెన్స్​ లో కూర్చోవడం చేయరాదు. ఎక్కి, దిగే సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించింది. అలాగే ఎవరూ చూడట్లేదు కదా అని పొగ తాగడం లాంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే ఇక జైలే అని తేల్చిచెప్పింది. ఈ నిబంధనలన్నీ ఎక్కడంటే తిరువళ్లూరు, ఆవడి, ఆరక్కోణం, తిరుత్తణి, సూళ్లూర్ పేట, గుమ్మిడిపూండిలకు నడుపుతున్న విద్యుత్​ సబర్బన్​ రైళ్లలో ప్రయాణించేవారికి దక్షిణ రైల్వే సూచించింది. ఎవరైనా అతిక్రమించి లక్షలాది మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ షరతులను తప్పనిసరిగా పాటించాలని కోరింది.

రైళ్ళో సీటు ఖాళీగా ఉందని కాలు వేస్తే.. శిక్షే - Tholi Paluku