Let's talk: editor@tmv.in
లారెన్స్ సాయం చేసింది ఈయనకే

లారెన్స్ సాయం చేసింది ఈయనకే

FL - SIMHCLM
14 సెప్టెంబర్, 2025

ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. 80 ఏళ్ల వయసులో పెద్దాయన జీవితం కోసం పడుతున్న కష్టాన్ని చూసిన కొరియోగ్రాఫర్ లారెన్స్ ఆయనకు ఆర్థికసాయం చేశారు. 80 ఏళ్ల ఈ వృద్ధుడు చెన్నై లోకల్ ట్రైన్స్ లో హోమ్ ఫుడ్స్, స్వీట్స్ అమ్ముతుంటాడు ఇందుకు అవసరమైన పదార్థాలు ఇంట్లో అతడి భార్య తయారు చేస్తుంది వీళ్లకు ఒక కూతురు ఉన్నప్పటికీ సరిగా చూసుకోకపోవడంతో ఆత్మాభిమానం దెబ్బ తిని ఎవరినీ పైసా అడగకుండా ఇదిగో ఇలా కష్టపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు.

ట్రైన్లో వెళ్తున్న ఒకరు ఈయన్ని చూసి ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది ఈ వృద్ధుడికి సాయం చేయటానికి ముందుకొస్తున్నారు .ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ఫోటో చూసిన లారెన్స్ ఈయనకు లక్ష రూపాయల సాయం ప్రకటించారు.

లారెన్స్ సాయం చేసింది ఈయనకే - Tholi Paluku