
చార్లి కిర్క్ హత్య..ట్రంప్ భద్రత కట్టుదిట్టం
కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ దారుణ హత్యతో వైట్ హౌస్ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. గురువారం అమెరికాలోని ఉతాహ్ వాలి యూనివర్శిటీలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా దుండగుడు దారుణంగా కాల్చి చంపాడు. ఈ హత్యను గవర్నర్ పొలిటికల్ అసాసినేషన్ గా అభివర్ణించారు. చార్లి కిర్క్ హత్యతో వాషింగ్టన్ తో పాటు కన్జర్వేటివ్ ఉద్యమం దిగ్భ్రాంతికి గురైనట్టు గవర్నర్ పేర్కొన్నారు. చార్లి కిర్క్ హత్య నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో ట్రంప్ భద్రతను వైట్ హౌస్ అధికారులు మరింత పెంచారు. సెప్టంబర్ 11,2001 పెంటగాన్ దాడి మృతుల్ని స్మరించుకునేందుకు ప్రతి ఏడాది బహిరంగ సభను నిర్వహిస్తారు. చార్లి కిర్క్ హత్య నేపథ్యంలో ఈసారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని కోర్టు యార్డు లోపలకి మార్చారు.
ట్రంప్ కార్యక్రమాలకు అదనపు భద్రతను కూడా పెంచారు. ఉతాహ్ యూనివర్శిటీ విద్యార్థులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. చార్లికిర్క్ హత్యకు సంబంధించిన సమాచారం లభిస్తే అధికారులకు అందించాలని కోరారు. చార్లి కిర్క్ హత్యపైన విచారణ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ .. చార్లికిర్క్ కు నివాళి అర్పించారు. కన్వజర్వేటివ్ ఉద్యమంలో బలమైన యువ గొంతుకను, మంచి స్నేహితుడిని కోల్పోయామని అభిప్రాయపడ్డారు. అమెరికా అత్యున్నత పౌర సన్మానం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ను చార్లి కిర్క్ కు ప్రధానం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. సాల్ట్ లేక్ సిటీలో నివాసం ఉంటున్న కిర్క్ కుటుంబాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా పరామర్శించనున్నారు. చార్లి కిర్క్ హత్య నేపథ్యంలో భద్రత గురించి ఆందోళన చెందుతున్నారా ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ట్రంప్ సమాధానమిచ్చారు.
