
తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే?
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని తమ కుమారులు, కూతుళ్ల నుండి తగిన సంరక్షణ, భరణం పొందకపోవడం సామాజిక సమస్యగా మారింది. వృద్ధుల ఆరోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం సహజం, కానీ పిల్లల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. మడికై జిల్లా మలప్పచేరిలో నివసిస్తున్న (68) ఏళ్ల ఎలియమ్మ జోసెఫ్ తన కుమారుడు ప్రతీష్ (46) నుండి భరణం అందకపోవడంతో నీలేశ్వరం పోలీసులు ఆర్డీఓ కోర్టు వారెంట్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
వృద్ధ తల్లిదండ్రుల హక్కులు
సీనియర్ సిటిజన్ల రక్షణ చట్టం ప్రకారం, 60 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులకు పిల్లలు తగిన సంరక్షణ, భరణం అందించడం తప్పనిసరి. వృద్ధ తల్లి ఎలియమ్మ తన బాగోగులు చూసుకోవడంలో కొడుకు నిర్లక్ష్యం చూపినట్లు ఫిర్యాదు చేయడంతో, కోర్టు ఆమెకు నెలకు రూ.2,000 భరణం అందించాలని ఆదేశించింది. అయితే ఆరు నెలల నుండి , భరణం చెల్లించకపోవడం కారణంగా ఎలియమ్మ తిరిగి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, కాగా బకాయిలను 10 రోజుల్లో చెల్లించాలని ఆర్డీఓ కోర్టు నోటీసులు జారీచేసింది.
అయితే, ప్రతీష్ కొన్ని దఫాలుగా విచారణకు హాజరైనప్పటికీ, భరణం చెల్లించడంలో నిర్లక్ష్యం చూపాడు. ట్రిబ్యునల్ జూలై 31 వరకు బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రతీష్ భరణం చెల్లించడానికి నిరాకరించాడు. దీంతో కోర్టు ఆరు నెలల బకాయిలు చెల్లించే వరకు నిందితుడిని జైల్లో ఉంచమని తీర్పు వెలువరించింది.ఈ ఘటన శ్రేణి కేరళ మడికై జిల్లాలో చోటుచేసుకుంది.
వయోవృద్ధ పౌరుల నిర్వహణ, రక్షణ , సంక్షేమ చట్టం - 2007
వృద్ధతలోనికి చేరిన తల్లిదండ్రులు పిల్లల నిర్లక్ష్యం వల్ల తగిన సంరక్షణ పొందకపోతే, వారు ముందుగా ఇచ్చిన ఆస్తిని తిరిగి పొందగలరు. ఇది సీనియర్ పౌరుల భరణా, సంక్షేమ చట్టం, 2007 కింద అందించే హక్కుగా, భారత సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు ధృవీకరించారు. చట్టం ప్రకారం, ట్రిబ్యునల్‌లు తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి, పిల్లల నిర్లక్ష్యం నిజమైతే ఆస్తిని తిరిగి ఇవ్వమని ఆదేశించవచ్చు.
చట్టంలోని ముఖ్య అంశాలు:
• పిల్లల బాధ్యత: 60 ఏళ్ల పైబడిన తల్లిదండ్రులకు పిల్లలు తగిన సంరక్షణ, భరణం అందించాల్సి ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
• ట్రిబ్యునల్ అధికారాలు: ట్రిబ్యునల్‌లు విచారణ చేసి, తల్లిదండ్రుల ఆస్తిని తిరిగి ఇవ్వమని ఆదేశించవచ్చు.
• గిఫ్ట్ డీడ్స్ రద్దు: నిర్లక్ష్యం సబబుగా ఉన్న సందర్భంలో, పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్స్ రద్దు చేయబడతాయి.
• వర్తించే పరిస్థితులు: చట్టం, పిల్లలకు ఇచ్చిన ఆస్తి, గిఫ్ట్‌లు, భరణం, సంరక్షణ అందించాలన్న అంచనాతో ఇచ్చిన సందర్భాల్లో వర్తిస్తుంది.
తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు:
• ఫిర్యాదు దాఖలు చేయడం: నిర్లక్ష్యం, భరణం అందించకపోవడం వంటి విషయాలపై ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.ఇందుకుసంపాందించి తగిన సాక్షాదారాలను సమర్పించాలి.
• ట్రిబ్యునల్ నిర్ణయం: విచారణ తర్వాత ట్రిబ్యునల్ తల్లిదండ్రులకు ఆస్తి తిరిగి ఇవ్వమని నిర్ణయం తీసుకుంటుంది.
