Let's talk: editor@tmv.in
బస్సులో గంజాయి రవాణా, ఇద్దరు అరెస్ట్

బస్సులో గంజాయి రవాణా, ఇద్దరు అరెస్ట్

Panthagani Anusha
13 సెప్టెంబర్, 2025

రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాపై కఠిన తనిఖీలలో భాగంగా రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం విజయవాడ జాతీయ రహదారిపై కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌కి బయలుదేరిన బస్సులో రెండు బ్రీఫ్ కేసుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఏఈఎస్ జీవన్‌కిరణ్, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్ నేతృత్వంలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రూట్ వాచ్ నిర్వహించగా, అనుమానాస్పద బస్సును ఆపి తనిఖీ చేశారు. రెండు బ్రీఫ్ కేసులను తెరిచి పరిశీలించినప్పుడు, వాటిలో గంజాయి దొరికింది. ఈ ఘటనలో బిరేన్ నాయక్, రాజేందర్ చెట్టిల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జైపూర్‌కు చెందిన కుష్బు అనే వ్యక్తి ఈ ఇద్దరి ద్వారా గంజాయిని హైదరాబాద్‌కి తరలిస్తున్నడని . ప్రస్తుతం కుష్బు పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం, గంజాయి కుష్బు ఎవరికి సరఫరా చేస్తున్నారో మాత్రమే తెలుసు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని. అవసరమైతే, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఏఈఎస్ జీవన్‌కిరణ్ తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా రాష్ట్రంలో నకిలీ డ్రగ్స్ రవాణా పై కఠినమైన నియంత్రణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇక గతంలోనూ మహేశ్వరం పోలీసులు ఒడిశా నుంచి హైదరాబాద్‌కి గంజాయి సరఫరా చేస్తుండగా 50.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లారీ డ్రైవర్ చదలవాడ అనిల్, స్కూల్ అటెండర్ అమ్మిరెడ్డి వెంకటలక్ష్మిని నిందితులుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

బస్సులో గంజాయి రవాణా, ఇద్దరు అరెస్ట్ - Tholi Paluku