
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏది?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ ఏమైందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ వైఫల్యంపై, శాంతి భద్రతల పట్ల నిర్లక్ష్యంపై ప్రశ్నించారు. గత కొద్ది నెలలుగా తన నియోజకవర్గంలో దాడులు, గ్యాంగ్ వార్స్, దోపిడీలు ఎక్కువయ్యాయి.ఈ మేరకు గురువారం స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్స్‌లో రేణు అగర్వాల్ హత్యను తీవ్రంగా ఖండించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సహస్ర హత్య, కేపీహెచ్‌బీలో వృద్ధ దంపతులను కట్టేసి బంగారు నగలు దోచుకెళ్లడం, తాజాగా రేణు అగర్వాల్ హత్య ఏం జరుగుతోంది.
హోం శాఖను సీఎం దగ్గర ఉంచుకొని కూడా ఏం ప్రయోజనం అని ఆయన అడిగారు. వీటిసై పై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నమ్మకంతో ఉపాధి ఇస్తే ఆ ఇంటి యజమానురాలిని డబ్బు కోసం చంపేయడం బాధేస్తుందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని తెలిపారు.ప్రజల భద్రతపై ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని బండి రమేష్ సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్ కూడా రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, నిందితులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
