Let's talk: editor@tmv.in
అనుమానంతో పసిబడ్డను చంపేసిన తండ్రి

అనుమానంతో పసిబడ్డను చంపేసిన తండ్రి

FL - SIMHCLM
12 సెప్టెంబర్, 2025

భార్యపై అనుమానంతో ఒక కసాయి తండ్రి కొడుకును హతమార్చాడు. కర్నూలు జిల్లాదేవనకొండ మండలానికి చెందిన నరేష్ (30) అనే యువకుడికి గోనెగండ్ల మండలం కులమాల గ్రామానికి చెందిన శ్రావణితో 18 నెలల క్రితం రెండవ వివాహం జరిగింది. వీరికి సాగర్(8 నెలల వయసు) అనే బాబు ఉన్నాడు. నరేష్ కు భార్యపై అనుమానం ఉండడంతో నిత్యం గొడవలకు దిగుతూ ఉండేవాడు.

అయితే, గత 15 రోజుల నుంచి పత్తికొండ కి వెళ్లే దారిలో ఉన్న తన ఎర్రచందనం తోటలో కాపురం ఉన్నాడు. గురువారం భార్యతో గొడవపడి ఇనుప రాడ్ తో భార్యను విచక్షణరహితంగా కొట్టి, తన కుమారుడిని నీటి తొట్టే లో ముంచి చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గాయాలతో ఉన్న శ్రావణి అంబులెన్స్ లో కర్నూల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు తమ ఫార్మ్ హౌస్ దగ్గర రోడ్డుపై ధర్నా చేసి దాదాపు గంటసేపు వాహనాలను నిలుపుదల చేశారు. నరేష్ గతంలో ఆదోనికి చెందిన శశికళను పెళ్లాడాడు. మొదటి భార్య అనుమానాస్పద స్థితిలో మూడు సంవత్సరాల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేశారు.

అనుమానంతో పసిబడ్డను చంపేసిన తండ్రి - Tholi Paluku