Let's talk: editor@tmv.in
క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ

Shaik Mohammad Shaffee
12 సెప్టెంబర్, 2025

భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి హాంగ్ కాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మ్యాచ్లో థాయ్లాండ్కు చెందిన పీరత్చాయ్ సుక్ఫున్, పక్కపోన్ తీరరాట్సకుల్పై గెలుపొందారు. గతంలో ప్రపంచ నంబర్ వన్గా ఉన్న ఈ జంట, ప్రస్తుత ర్యాంకింగ్ ప్రకారం ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగింది. తొలి గేమ్ను కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకొని, థాయ్ జోడీపై 18-21, 21-15, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్ 63 నిమిషాల పాటు జరిగింది.

ప్రపంచ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న సాత్విక్, చిరాగ్.. ఇటీవల పారిస్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. తదుపరి మ్యాచ్లో మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడనున్నారు. ఈ మ్యాచ్లో భారత జోడీ నెమ్మదిగా ప్రారంభించింది. తొలి గేమ్లో 8-11తో వెనుకబడింది. అయితే పోరాడి 18-18తో సమం చేసినప్పటికీ, థాయ్ జోడీ వరుసగా మూడు పాయింట్లు సాధించి తొలి గేమ్ను గెలుచుకుంది.

ఈ ఓటమితో పుంజుకున్న భారత క్రీడాకారులు రెండో గేమ్లో మరింత దూకుడుగా ఆడారు. 2-2 నుంచి 7-7 వరకు ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ తర్వాత 11-10తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జంట, ఆ గేమ్ను గెలుచుకుని మ్యాచ్ను నిర్ణయాత్మక గేమ్కు తీసుకెళ్లింది. మూడో గేమ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. సాత్విక్, చిరాగ్ 7-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. థాయ్ జోడీ తడబడటంతో భారత జంట విజయం సాధించింది.

పీవీ సింధు నిష్క్రమణ

మరోవైపు హాంగ్ కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె డెన్మార్క్కు చెందిన లీన్ క్రిస్టోఫెర్సన్ చేతిలో ఓడిపోయారు. తొలి గేమ్లో 21-15 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు, చివరి రెండు గేమ్లలో 16-21, 19-21 తేడాతో ప్రత్యర్థి చేతితో ఓటమి పాలయ్యారు. ఈ టోర్నమెంట్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 24వ స్థానంలో ఉన్న పీవీ సింధు.. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ మొదటి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమితో ఆమె ఒలింపిక్స్లో నేరుగా అర్హత సాధించే అవకాశాలను కోల్పోయారు.

క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ జోడీ - Tholi Paluku