Let's talk: editor@tmv.in
కేంద్ర రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

కేంద్ర రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ

Gaddamidi Naveen
22 జూన్, 2026

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు వీలుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాశారు.

ఈ విషయమై జూన్ 16, 2026న తాను రాసిన మునుపటి లేఖను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నిధుల మంజూరుకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అత్యవసర అవసరం ఉందని ముఖ్యమంత్రి లేఖలో స్పష్టం చేశారు.

ఈ నెల 22, 23వ తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఈ పెండింగ్ అంశాలపై ఉమ్మడిగా చర్చించి, వీటికి సంబంధించిన అన్ని వాస్తవాలు, ఒప్పందాలు అవసరమైన సహాయక పత్రాలను రికార్డుల్లో పొందుపరిచేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదని.. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇదొక అత్యంత కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి, పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించడం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో వివరించారు.

ట్యాగ్‌లు
HyderabadMetroMetroRailHyderabadTelanganaRevanthReddyKishanReddyAshwiniVaishnawHyderabadMetroPhase2MetroExpansionIRFC
కేంద్ర రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ లేఖ - Tholi Paluku