Let's talk: editor@tmv.in
87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ

87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ

Dantu Vijaya Lakshmi Prasanna
12 డిసెంబర్, 2025

యోనెక్స్ - సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ - 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విజయవాడలో జరిగే ఈ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించేందుకు క్రీడా శాఖ, మున్సిపాలిటీ, శాప్ విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎంకు వివరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఛాంపియన్ ఫిప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన పాల్గొనే జాతీయ స్థాయి క్రీడాకారుల వివరాలు, నిర్వహణకు చేపట్టిన చర్యలను సీఎంకు తెలిపారు. ఈ టోర్నమెంటను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం సూచించారు. సీఎంను కలిసిన వారిలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఉన్నారు.

ఈ సందర్బంగా శాప్ ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోపీచంద్ కి స్థలమిచ్చి అకాడమీ పెట్టించారని తద్వారా అనేకమంది క్రీడాకారులు తయారయ్యారని ఈ ప్రభుత్వంలో కూడా గోపీచంద్ అమరావతిలో భూమిని కేటాయించడం, భూమి పూజ చేయడం కూడా జరిగిందని చెప్పారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడింబి శ్రీకాంత్ కి తిరుపతిలో అకాడమీ పెట్టడానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు విజయవాడలో నిర్వహించే నేషనల్ ఛాంపియన్షిప్ లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నలుమూలల క్రీడా పోటీలను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పోర్ట్స్ అధారిటీ కృషి చేస్తుంది అని తెలియజేశారు.

87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోస్టర్ ఆవిష్కరణ - Tholi Paluku