Let's talk: editor@tmv.in
213 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్

213 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్

Shaik Mohammad Shaffee
16 సెప్టెంబర్, 2025

తొలిపలుకు, విద్య, ఉద్యోగం:* యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 213 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 2 వరకు అధికారిక వెబ్ సైట్ లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్: 5 పోస్టులు; అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 16 పోస్టులు; అడిషనల్ లీగల్ అడ్వైజర్: 2 పోస్టులు; అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్: 1 పోస్టు; డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్: 2 పోస్టులు; డిప్యూటీ లీగల్ అడ్వైజర్: 12 పోస్టులు; లెక్చరర్ (ఉర్దూ): 15 పోస్టులు; మెడికల్ ఆఫీసర్: 125 పోస్టులు; అకౌంట్స్ ఆఫీసర్: 32 పోస్టులు; అసిస్టెంట్ డైరెక్టర్: 3 పోస్టులు

పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిగ్రీ(లా), పీజీ (ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్లో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్ధుల వయోపరిమితి విషయానికి వస్తే, జనరల్ అభ్యర్థులకు 50 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 53 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 56 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.25 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించండి.

213 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ - Tholi Paluku