
2034 వరకు మాదే అధికారం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.నా మాట గుర్తుంచుకోండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జూన్ 2034 వరకు అధికారంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తదుపరి ఎన్నికలు జూన్ 2029లో జరుగుతాయని. ఆ ఎన్నికలు కూడా ‘జమిలీ ఎన్నికలు’గా జరిగే అవకాశం ఉందని. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని ఉంచారని. ఆ నమ్మకమే మా బలం అని చెప్పారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు వేగాలపై సాగేలా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజల మద్దతుతో మేము వచ్చిన ప్రభుత్వం, ప్రజల ఆశలు నెరవేర్చే వరకు మేము వెనుదిరగం. తెలంగాణను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ కు 10ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2034 వరకు అధికారంలోనే ఉంటుందిని ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం,అందుకే కేసీఆర్ ప్రచారానికి రాలేదు.
జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్‌కి ఓటు ఎందుకు వేయాలి? పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) తన పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఒక లేఖ గానీ, వీడియో గానీ విడుదల చేయకపోవడం వెనుక అర్థం ఏమిటి? అని సీఎం ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి, కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఎందుకంటే ఆయనకే తెలుసు బీఆర్ఎస్‌కి ఈ ఉపఎన్నికలో ఓటమి ఖాయం అని. అందుకే ఆయన ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు. పార్టీ అధ్యక్షుడే ప్రజలను సంప్రదించడానికి ఆసక్తి చూపకపోతే, ప్రజలు కేటీఆర్, హరీశ్‌రావు మాట ఎందుకు వినాలి? అని సీఎం ఎద్దేవా చేశారు.జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కి మరో ఎమ్మెల్యే ఎందుకు కావాలి? ఇప్పటికే ఆ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అయినా కూడా బీఆర్ఎస్‌కి మరో ఎమ్మెల్యే అవసరం ఎందుకైంది? అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ ఓటమి, బీజేపీకి డిపాజిట్ గల్లంతు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక ఫలితాలపై తమ అంచనాలు తెలిపారు.జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోతుందన్నారు.అలాగే నవంబర్ 14న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఇది స్పష్టమవుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతోందని, అందుకే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఎన్నికలో పరాజయం పాలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
