Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
2009 నుంచి అమెరికా 18,822 మంది భారతీయులను వెనక్కి పంపింది: జైశంకర్

2009 నుంచి అమెరికా 18,822 మంది భారతీయులను వెనక్కి పంపింది: జైశంకర్

Pinjari Chand
4 డిసెంబర్, 2025

2009 నుంచి ఇప్పటివరకు మొత్తం 18,822 మంది భారతీయ పౌరులను అమెరికా డిపోర్ట్ చేసిందని, అందులో 2025 జనవరి నుంచి డిసెంబర్ 4 వరకు 3,258 మందిని తిరిగి పంపించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రాజ్యసభలో తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన వివరాలు వెల్లడించారు.

2023లో 617 మంది, 2024లో 1,368, 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 3,258 మందిని అమెరికా తిప్పి పంపిందని సభలో విదేశాంగ మంత్రి వివరించారు. 2025లో డిపోర్ట్ అయిన 3,258 మందిలో 2,032 మంది (సుమారు 62.3శాతం) ఎకనామిక్ విమానాల్లో, మిగతా 1,226 మంది (37.6శాతం) అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ / కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ కు చెందిన చార్టర్ విమానాల్లో తిరిగి వచ్చారు.

మానవ అక్రమ రవాణా కేసులు – పంజాబ్‌లోనే అత్యధికం

మానవ అక్రమ రవాణా కేసుల్లో పంజాబ్ రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో కేసులున్నాయని వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ మానవ అక్రమ రవాణా విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 27 కేసులు నమోదు, 169 అరెస్టులు, 132 మందిపై చార్జిషీట్లు దాఖలు అయ్యాయాని తెలిపారు.

పంజాబ్‌లో: 25 ఎఫ్ఐఆర్ లు, 58 మంది అక్రమ ట్రావెల్ ఏజెంట్లపై కేసులు, 16 మంది అరెస్ట్.

హర్యానాలో: 2,325 ఫిర్యాదులు, 44 ఎఫ్ఐఆర్ లు, 27 మంది అరెస్ట్ అయ్యారు. గుజరాత్‌లో ఒకు అరెస్ట్ అయ్యారు.

అమెరికా వైఖరి పై భారత్ ఆందోళన

అమెరికా భారతదేశానికి చెందిన వారిని తిప్పి పంపే క్రమంలో వారికి సంకెళ్లు వేసి పంపింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై వాటిని ఉపయోగించడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని జైశంకర్ తెలిపారు. ఫిబ్రవరి 5 తర్వాత మహిళలు, పిల్లలపై సంకెళ్లు వాడిన ఒక్క సంఘటన కూడా భారత దౌత్యశాఖ దృష్టికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధికారులు తమ విధానం 2012 నవంబర్ 19 నుంచి అమలులో ఉందని, విమానంలో ఉన్న అందరి భద్రత కోసమే ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. అయితే తీవ్ర నేరాలు (హత్య, ఉగ్రవాదం, ఎక్స్‌టార్షన్ మొ.) చేసిన నేరస్థులు, వాంటెడ్ క్రిమినల్స్ కూడా ఈ విమానాల్లోనే తిప్పి పంపుతున్నారని వివరించారు. ఉదాహరణకు లఖ్వీందర్ సింగ్, అన్మోల్ బిష్నోయ్ వంటి వారు కూడా ఇలాంటి వాటిలోనే తిరిగి వచ్చారు.

73 ఏళ్ల హరజీత్ కౌర్ కేసు

ఫిబ్రవరి 25న డిపోర్ట్ అయిన 73 ఏళ్ల హరజీత్ కౌర్‌కు హ్యాండ్‌కఫ్ వేయలేదని, కానీ నిర్బంధ సమయంలో అన్యాయం జరిగిందని జైశంకర్ తెలిపారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 26న అమెరికా ఎంబసీతో జరిగిన సమావేశంలో అధికారికంగా లేవనెత్తామని, వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశామని ఆయన పేర్కొన్నారు. డిపోర్టీలు తిరిగి వచ్చినప్పుడు వారితో భారత అధికారులు మాట్లాడతారని, వారి సమాచారం ఆధారంగా అక్రమ ఏజెంట్లు, మానవ అక్రమ రవాణా మాఫియాపై కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు.

2009 నుంచి అమెరికా 18,822 మంది భారతీయులను వెనక్కి పంపింది: జైశంకర్ - Tholi Paluku