Let's talk: editor@tmv.in
13 ఏళ్లకు సొంతింటికి చేరిన జార్ఖండ్ వాసి!

13 ఏళ్లకు సొంతింటికి చేరిన జార్ఖండ్ వాసి!

FL - YUGDR
14 సెప్టెంబర్, 2025

వ్యసనాలకు బానిసై కుటుంబానికి దూరంగా బతుకుతున్న జార్ఖండ్ వాసి 13 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరారు. జార్ఖండ్కు చెందిన అర్జున్కు పెళ్ళయి ఇద్దరు ఆడపిల్లలున్నారు. గంజాయి సేవించడం వల్ల మతిస్థిమితం కోల్పోయి భార్య పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయాడు. భార్య కూడా పిల్లల్ని అనాధల్ని చేసి వెళ్ళిపోతే అర్జున్ సోదరి వారిని చేరదీసి 13 ఏళ్ళుగా పోషిస్తుంది.

విశాఖ రైల్వే స్టేషన్లో అర్జున్ ని "మే" నెలలో పట్టుకుని ఏ యూ టీ డీ సంస్థ నిర్వహించే షెల్టర్లో పెట్టి చికిత్స అందించారు. అర్జున్ కోలుకోవడంతో సెప్టెంబర్ 10వ తేదీన జార్ఖండ్లోని టాటానగర్ దగ్గర కిదాడి గ్రామంలో ఇద్దరి కుమారైలు, చెల్లికి అప్పగించామని షెల్టర్ నిర్వాహకుడు ప్రగడ వాసు తెలిపారు. చిన్నతనంలో పిల్లల్ని వదిలేయడంతో తండ్రిని గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అర్జున్ను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

13 ఏళ్లకు సొంతింటికి చేరిన జార్ఖండ్ వాసి! - Tholi Paluku