Let's talk: editor@tmv.in
1.2 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లతో రిలయన్స్ జియో

1.2 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లతో రిలయన్స్ జియో

Dantu Vijaya Lakshmi Prasanna
4 జనవరి, 2026

నవంబర్ నెలలో రిలయన్స్ జియో 1.2 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌పై వరుసగా 9వ నెలలో కూడా తన ఆధిక్యాన్ని కొనసాగించింది.

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి.

నవంబర్ 2025లో జియో 1.2 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకుంది. పరిశ్రమలో యాక్టివ్ యూజర్లను సంపాదించిన ఏకైక కంపెనీగా జియో నిలిచింది.

మిగిలిన నెట్‌వర్క్‌ల పరిస్థితి చూస్తే, పరిశ్రమ మొత్తం మీద యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు 3.4 మిలియన్లు తగ్గారు. వోడాఫోన్ ఐడియా 2.2 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కోల్పోగా, ఎయిర్‌టెల్ 1.7 మిలియన్ల యూజర్లను కోల్పోయింది.

మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, జియో మార్కెట్ వాటా 43.7%కి పెరిగింది. మిగిలిన ఆపరేటర్లందరూ తమ మార్కెట్ వాటాను కోల్పోయారు.

మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ విభాగాల్లో జియో 68% కొత్త వినియోగదారులను ఆకర్షించింది. ముఖ్యంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో ఎయిర్‌టెల్ కంటే జియో 2.5 రెట్లు ఎక్కువ మందిని చేర్చుకుంది. జమ్మూ & కాశ్మీర్, పంజాబ్ సర్కిళ్లలో జియో గణనీయమైన వృద్ధిని సాధించింది.

మొత్తం మీద 2025 క్యాలెండర్ సంవత్సరంలో యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల చేరిక గత తొమ్మిదేళ్లలో అత్యధికంగా ఉండటం గమనార్హం. డేటా వాడకం పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో సగటు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

1.2 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లతో రిలయన్స్ జియో - Tholi Paluku