Let's talk: editor@tmv.in
హోలానీ కన్సల్టెంట్స్ సరికొత్త రికార్డు

హోలానీ కన్సల్టెంట్స్ సరికొత్త రికార్డు

Dantu Vijaya Lakshmi Prasanna
28 డిసెంబర్, 2025

భారతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమల క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో హోలానీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అపూర్వమైన మైలురాయిని అధిగమించింది. ఆ సంస్థ రూపొందించిన శ్యామ్ ధని ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీఓ, ఏకంగా 918.09 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యి ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.25,308 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.

ఈలావాదేవీకి మర్చంట్ బ్యాంకర్‌గా వ్యవహరించిన హోలానీ కన్సల్టెంట్స్, పెట్టుబడిదారులలో నమ్మకాన్ని కలిగించడంలో, విజయవంతమైన క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలను నిర్వహించడంలో తమ నైపుణ్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా హోలానీ కన్సల్టెంట్స్ డైరెక్టర్ అశోక్ హోలానీ మాట్లాడుతూ,

"ఈ అసాధారణ స్పందన చిన్న,మధ్యతరహా పరిశ్రమల మార్కెట్ లావాదేవీలలో మా నిబద్ధతను మాపై పెట్టుబడిదారులు ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేసిన పెట్టుబడిదారులకు, మధ్యవర్తులకు వాటాదారులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము."

యాంకర్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం

హోలానీ కన్సల్టెంట్స్ ప్రముఖ సంస్థల నుండి బలమైన యాంకర్ ఇన్వెస్టర్ మద్దతును పొందింది. అందులో ముఖ్యమైనవి.

• సిడ్బి

• రాజస్థాన్ గ్లోబల్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్

• ఎస్ బి ఆపర్చునిటీస్ ఫండ్

• సెయింట్ క్యాపిటల్ ఫండ్

• మేరు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ పిసిసి

• మింట్ ఫోకస్డ్ గ్రోత్ ఫండ్ పిసిసి

• హోలానీ వెంచర్ క్యాపిటల్ ఫండ్

సబ్‌స్క్రిప్షన్ వివరాలు (యాంకర్ పోర్షన్ మినహా)

ఈ ఐపీఓకు అన్ని వర్గాల నుండి భారీ స్పందన లభించింది

• సంస్థాగత పెట్టుబడిదారులు 256.24 రెట్లు

• సంస్థాగతేతర పెట్టుబడిదారులు 1,612.65 రెట్లు

• రిటైల్ పెట్టుబడిదారులు 1,137.92 రెట్లు

• మొత్తం సబ్‌స్క్రిప్షన్ 918.09 రెట్లు

• వచ్చిన మొత్తం బిడ్లు రూ.25,308.16 కోట్లు

హోలానీ కన్సల్టెంట్స్ గురించి

హోలానీ కన్సల్టెంట్స్ జైపూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సెబీ నమోదిత కేటగిరీ-1 మర్చంట్ బ్యాంకర్. 2018లో లైసెన్స్ పొందినప్పటి నుండి, ఈ సంస్థ ఇప్పటివరకు 21 కంపెనీలకు నిధుల సేకరణలో సహాయపడింది. ఈక్విటీ మార్కెట్ల ద్వారా మొత్తం రూ.1,500 కోట్లకు పైగా నిధులను సేకరించింది. ఇందులో 2 మెయిన్‌బోర్డ్ ఐపీఓలు, 16 చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఐపీఓలు, 2 ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌లు, ఒక రైట్స్ ఇష్యూ ఉన్నాయి.

హోలానీ కన్సల్టెంట్స్ సరికొత్త రికార్డు - Tholi Paluku