
హోండా భారత్‌లో విస్తరణ.. 2030 వరకు 10 కొత్త మోడల్స్
హోండా కంపెనీ భారతదేశంలో మళ్లీ పెద్దగా ఎదగాలని నిర్ణయించింది. 2030 లోపు 10 కొత్త కార్లు తెస్తుంది, వాటిలో 7 ఎస్‌యూవీలు. ఇది కంపెనీకి పెద్ద మలుపు, ప్రస్తుతం 43 లక్షల యూనిట్ల మార్కెట్ 2030 నాటికి 60 లక్షలకు చేరుకుంటుందని అంచనా. యువకులు, కుటుంబాలు ఎస్యూవిలపై ఆకర్షితులవుతున్న సమయంలో హోండా ఈ ట్రెండ్‌ను పట్టుకుని మార్కెట్ షేర్ పెంచాలని లక్ష్యం పెట్టుకుంది. ఇది హ్యుండాయ్, కియా, మారుతి, టాటా వంటి పోటీదారులకు కొత్త సవాలుగా మారనుంది.
భారత్‌ను గ్లోబల్ గ్రోత్ హబ్‌గా మార్చాలని హోండా
హోండా అధ్యక్షుడు టోషిహిరో మిబే చెప్పినట్టు, భారత్, అమెరికా, జపాన్‌తో పాటు టాప్ గ్రోత్ మార్కెట్‌లలో భారత్ ముందంజ లో ఉంది. చైనా మేకర్ల పోటీ, గ్లోబల్ మార్కెట్ మార్పుల మధ్య భారత్‌లో దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం కేవలం మూడు మోడల్స్ (సిటీ, అమేజ్, ఎలివేట్)తో మార్కెట్‌లో ఉన్న హోండా, ఎలివేట్ ఎస్యూవి విజయంపై ఆధారపడి పెద్ద ఎదుగుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్లాన్‌లో ఐసీఈ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈవి మోడల్‌ను భారత్‌లో తయారు చేసి, జపాన్, ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఇది భారత్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుస్తుంది.
భారతీయులు ఎస్యూవి లకు మక్కువ చూపుతున్నారు. కాంపాక్ట్ నుంచి ప్రీమియం వరకు. హోండా ఏడు ఎస్యూవి లతో ఈ సెగ్మెంట్‌ను కవర్ చేస్తుంది. గ్లోబల్ ప్రీమియం మోడల్స్ (సిఆర్-వి, ప్రెలూడ్ వంటివి), భారత్‌కు తగినట్టు తయారు చేసిన వాహనాలు. సబ్- 4 మీటర్ ఎస్యూవి సెగ్మెంట్‌లో కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇది మార్కెట్‌లో పెద్ద వాల్యూమ్ గ్రోత్ ఇస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీని విస్తరించి, ఈవి లతో ఎలక్ట్రిక్ షిఫ్ట్ చేస్తుంది. ఈవి 2027లో భారత్, జపాన్‌లో లాంచ్ అవుతుంది.
ప్రస్తుతం 300కి పైగా డీలర్‌షిప్‌లు ఉన్న హోండా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతాలో బలంగా ఉంది. టైర్-2, టైర్-3 నగరాలు (కోయింబత్తూర్, లఖ్‌నౌ, చండీగఢ్, ఇండోర్)లో మరింత విస్తరిస్తుంది. ఇక్కడ రోడ్లు మెరుగుపడటం, ఆదాయాలు పెరగటంతో కారు కొనుగోళ్లు జోరు. యువ ప్రొఫెషనల్స్, కుటుంబాలకు ఫీచర్‌లు పూర్తి ఎస్యూవి లు, ప్రీమియం కస్టమర్లకు గ్లోబల్ మోడల్స్ రూపొందిస్తారు. అఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను బలోపేతం చేస్తూ, కస్టమర్ ట్రస్ట్ పెంచుతారు.
ఇండస్ట్రీ నిపుణులు, హోండా ఈ ప్లాన్‌తో మిడ్ సైజ్ ఎస్యూవి , ప్రీమియం హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లలో పోటీని పెంచుతుందని చెబుతున్నారు. లోకలైజేషన్, ఇన్నోవేషన్, కస్టమర్ డిజైన్‌పై దృష్టి పెట్టి, ఒకప్పుడు ఉన్న మార్కెట్ షేర్‌ను తిరిగి పొందాలని లక్ష్యం. భారత్ కేవలం ఎమర్జింగ్ మార్కెట్ కాదు, గ్లోబల్ ఆటో గ్రోత్ సెంటర్ అని ఒక నిపుణుడు అన్నారు. రెండు చక్రాల వాహనాల్లో విజయం సాధించినట్టు, కార్లలో కూడా భారతీయ సప్లయర్ తో భాగస్వామ్యాలు పెంచుతుంది. ఈ ఐదేళ్లు హోండాకు కీలకంగా మారుతుంది. మార్కెట్ షేర్ పెరగాలి. భారత ఆటో ల్యాండ్‌స్కేప్ మారాలి. యువకులు ఎస్యూవి లపై అప్పుడే ఆసక్తిగా ఉన్నారు.
