
హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.1.4 కోట్లు విలువైన వస్తువులు స్వాధీనం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన సుమారు రూ.1.4 కోట్ల విలువైన అధిక, ధర ఎలక్ట్రానిక్ వస్తువులను, నిషేధిత డ్రోన్లను ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది.
సీఐఎస్ఎఫ్ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,నవంబర్ 11న అబుదాబి నుంచి వచ్చిన విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని ఇద్దరి ప్రయాణికులను గమనించారు.వారిని ఆపి, వారి సామాను డొమెస్టిక్ అరైవల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న ఎక్స్‌బిస్, యంత్రం ద్వారా స్క్రీనింగ్ చేయగా, భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి. అందులో అనేక నిషేధిత డ్రోన్లు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీస్ వంటి
వస్తువులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
పరిశీలనలో భాగంగా సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికులను కొనుగోలు బిల్లులు లేదా దిగుమతి అనుమతుల కోసం అడిగినప్పటికీ, వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు చూపలేకపోయారు. దీంతో, స్మగ్లింగ్ చేసిన వస్తువులతోపాటు ఇద్దరినీ కస్టమ్స్ అధికారులకు చట్టపరమైన చర్యల కోసం అప్పగించినట్లు సీఐఎస్ఎఫ్ పేర్కొంది.సంఘటనపై సీఐఎస్ఎఫ్ తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా సమాచారం విడుదల చేసింది. ఈ ఘటనతో అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా బలగాలు స్మగ్లింగ్ కార్యకలాపాలపై మరింత నిఘా పెంచుతున్నాయి.
