
హైదరాబాద్ మౌలిక వసతులపై శాఖల సమన్వయ భేటీ
హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా, వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం కల్పించేందుకు బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో హైడ్రా ,హైదరాబాద్ వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో పాటు ఇతర సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా, నగరంలో కొనసాగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించడంతో పాటు, అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని బలపరిచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
సమావేశంలో చర్చించిన అంశాలు
రోడ్ల విస్తరణ, నీటి,అలాగే మురుగునీటి పైపుల మార్పిడి, ఇతర సివిల్ వర్క్‌లలో ఒక శాఖ పని ముగించాక మరొక శాఖ మళ్లీ అదే చోట పనులు చేయకుండా ముందస్తుగా సమన్వయం అవసరం. పునరుద్ఘాటన నివారించేందుకు ప్రణాళికాత్మక సమన్వయం ఎంతో అవసరయని తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, వార్డు స్థాయిలో ట్రాఫిక్ డైవర్షన్, టైమ్ షెడ్యూల్ ప్రకారం పనుల అమలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పబ్లిక్ సేఫ్టీ, రోడ్ రీస్టోరేషన్, పనులు సమయ పరిమితుల్లో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి చూపాలి. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించే వ్యవస్థను రూపొందించాలి. వారాంతపు సమీక్షల ద్వారా ప్రగతి గమనాన్ని తక్షణం అంచనా వేసే విధానం నియమలు పాటించాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశం ద్వారా శాఖల మధ్య సమర్థవంతమైన సమాచారం మార్పిడితో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని. క్షేత్ర స్థాయిలో నేరుగా జరిగే సమయానికి అనుగుణంగా మానిటరింగ్ చేయగలగడం వల్ల పనుల్లో వేగం, నాణ్యత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
