Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో మెస్సీ మేనియా

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం సుమారు 5.40 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. నగరానికి చేరుకున్న మెస్సి బృందం తొలుత ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం, ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న 'మెస్సి - గోట్ ఫుట్‌బాల్ మ్యాచ్' ప్రారంభంమైంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ‘గోట్ ఇండియా టూర్ 2025’ రెండో దశ సానుకూల వాతావరణంలో సాగింది. కోల్‌కతాలో జరిగిన తొలి దశలో అవ్యవస్థ, భద్రతా లోపాల కారణంగా ఏర్పడిన గందరగోళానికి భిన్నంగా, హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమం సమగ్ర ప్రణాళిక, క్రమశిక్షణ, సమర్థవంతమైన ఏర్పాట్లతో ఆదర్శంగా నిలిచింది.

గోట్‌ కప్‌ పేరుతో ఉప్పల్‌ స్టేడియంలో ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా మెస్సి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. సింగరేణి ఆర్‌ఆర్‌9 టీమ్‌ తరఫున మైదానంలో దిగిన సీఎం రేవంత్‌రెడ్డి గోల్‌ కొట్టారు. మెస్సి రెండో గోల్స్‌ రాబట్టారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి మెస్సి, రేవంత్‌ ఫొటోలు దిగారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం ఫుట్‌బాల్ అభిమానులకు కనువిందు చేసే విధంగా లియోనల్ మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టు మధ్య స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.

సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సింగరేణి జట్టు, మెస్సీ నేతృత్వంలోని జట్టుపై విజయం సాధించింది. ఇరుజట్లు ఉత్సాహంగా ఆడగా, మ్యాచ్ మొత్తం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్‌లో పాల్గొని క్రీడల పట్ల తన ఆసక్తిని చాటుకున్నారు. మెస్సీతో కలిసి మైదానంలో అడుగులు వేయడం ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం విజేత సింగరేణి జట్టుకు, రన్నర్స్‌గా నిలిచిన మెస్సీ జట్టుకు లియోనల్ మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్తంగా ట్రోఫీలు అందజేశారు.మెస్సి జట్టుపై 3-0 గోల్స్‌తో సింగరేణి ఆర్‌ఆర్‌ జట్టు విజయం సాధించింది. విన్నర్‌, రన్నరప్‌ జట్ల సభ్యులకు మెస్సి, సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ట్రోఫీలు అందించారు.ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా, శాంతియుతంగా, క్రమబద్ధంగా కార్యక్రమం ముగియడం నగర నిర్వాహక సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇక మెస్సీ ఆదివారం ముంబై చేరుకుని ‘గోట్ ఇండియా టూర్ 2025’ మూడో దశలో పాల్గొననున్నారు. సోమవారం న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని తన పర్యటనను ముగించనున్నారు.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన‌ ‘గోట్ ఇండియా టూర్’ కార్యక్రమానికి హాజరై ఈ ఈవెంట్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొననున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌లో సింగరేణి ఆర్‌ఆర్9 జట్టు, అపర్ణా-మెస్సీ ఆల్ స్టార్స్ జట్టు తలపడాయి. మ్యాచ్ అనంతరం రాత్రి 10.30 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం చేశారు.

డ్రోన్ ఫీడ్‌లతో సహా మొత్తం 375 నిఘా కెమెరాలు వ్యవస్థలో అనుసంధానం చేయబడ్డాయి. అధునాతన పర్యవేక్షణ భాగాలను ఉపయోగించి లైవ్ ఫీడ్‌లను నిరంతరం విశ్లేషిస్తు ప్రభావవంతమైన బందోబస్ట్ నిర్వహణ కోసం సంబంధిత రంగానికి, ఫీల్డ్ అధికారులకు కార్యాచరణ నిఘా నేరుగా ప్రసారం చేయబడింది. ఈ కార్యక్రమానికి 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.

ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల సందడి

ఈ మెగా ఈవెంట్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. తమ అభిమాన ఆటగాడిని, ప్రపంచ కప్ విజేతను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతో అభిమానులు భారీగా స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియం అంతటా అభిమానుల సందడితో ఉప్పల్ ప్రాంతం మారుమోగుతోంది. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో నిర్వహించిన అద్భుతమైన లేజర్ షో, రంగుల కల్చరల్ ఈవెంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సంగీతం, నృత్య ప్రదర్శనలతో పాటు లైటింగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఉప్పల్ స్టేడియాన్ని పండుగ వాతావరణంతో నింపాయి. ఈ కార్యక్రమం హైదరాబాద్ క్రీడా ప్రేమికులకు మరపురాని అనుభూతిని అందించింది.

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా - Tholi Paluku