
హైదరాబాద్‌లో ట్రిపుల్ఐటి లో ఏఐ కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, విభాగాల్లో నైపుణ్యం పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ట్రిపుల్ఐటి హైదరాబాద్ ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది. ట్రిపుల్ఐటి హైదరాబాద్‌లోని ‘ఐ హబ్ - డేటా’ విభాగం ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆరు నెలల శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోర్సు ముఖ్యాంశాలు:
హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కాలేజీల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో భాగంగా ఏఐ/ మిషన్ లెర్నింగ్ లోని ప్రాథమిక అంశాల నుండి ఆధునిక టెక్నాలజీల వరకు లోతైన శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం థియరీ మాత్రమే కాకుండా, విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించేలా హ్యాండ్స్-ఆన్ ట్యుటోరియల్స్ నిర్వహిస్తారు.
తరగతుల నిర్వహణ:
ఈ శిక్షణ తరగతులు నేరుగా ట్రిపుల్ఐటి హైదరాబాద్ క్యాంపస్‌లోనే జరుగుతాయి. ఫిబ్రవరి 22, 2026 నుండి ప్రారంభమయ్యే ఈ కోర్సు ఆరు నెలల పాటు కొనసాగుతుంది. విద్యార్థుల వీలును బట్టి ప్రతి ఆదివారం రెండు గంటల పాటు కాంటాక్ట్ సెషన్లు ఉంటాయని ‘ఐ హబ్ - డేటా’ ప్రతినిధులు తెలిపారు.
ఇంటర్న్‌షిప్ అవకాశం:
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ‘ఐ హబ్ - డేటా’ లో మూడు నెలల పాటు ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది విద్యార్థులకు రియల్-వరల్డ్ ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తుకు చివరి తేదీ:
ఫిబ్రవరి 20, 2026 (శనివారం).
తరగతులు ప్రారంభం:
ఫిబ్రవరి 22, 2026.
వెబ్‌సైట్:
వివరాల కోసం https://ihub-data.ai ని సందర్శించవచ్చు.
సంప్రదించాల్సిన ఈమెయిల్:
faheema.vv@ihub-data.iiit.ac.in
(ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫహీమా వి.వి.).
కెరీర్ పరంగా ఎదగాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ‘ఐ హబ్ - డేటా’ విద్యా కార్యక్రమాల విభాగం అధిపతి డాక్టర్ సి.కె. రాజు సూచించారు.
