Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా విజయవంతం

హైదరాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా విజయవంతం

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు TUWJ–IJU (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ - ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. మాసబ్‌ట్యాంక్‌లో గల రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు ఈ ధర్నాకు హాజరై, తమ సహచర జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు.

సమస్యల పరిష్కారానికి డిమాండ్

జర్నలిస్టులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ఫీల్డ్‌లో పనిచేస్తున్న రిపోర్టర్లు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలు, అక్రిడిటేషన్ ప్రక్రియలో ఉన్న జాప్యాలు, అత్యవసర సేవల అందుబాటులో లోపాలు, వెంట‌నే హెల్త్ కార్డులు అందించాలి, అకాల‌మ‌ర‌ణం చెందిన జ‌ర్న‌లిస్టుల కుంటుంబాల‌ను ఆదుకోవాలి,రిట్తెర్డ్ జ‌ర్న‌లిస్టుల‌కు పెన్ష‌న్ ప‌థ‌కం అమ‌లు చెయ్యాలి, వృత్తి క‌మిటీల‌ను వెంట‌నే ఏర్పాటు వంటి అనేక అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిందిగా మీడియాలో ప్రతినిధులు ఈ ధర్నా ద్వారా స్పష్టం చేశారు.

ఈ ధర్నాకు హాజరైన మీడియా ప్రతినిధులంతా ఐక్యతను ప్రదర్శిస్తూ, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో, తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో జర్నలిస్టుల మహాధర్నా విజయవంతం - Tholi Paluku