Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌‌కు ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్

హైదరాబాద్‌‌కు ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్

Gaddamidi Naveen
3 నవంబర్, 2025

హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నగరంలోని హైటెక్ సిటీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో, సంస్థ క్యాపిటాల్యాండ్ భవనంలో 41,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలంను లీజుకు తీసుకుంది.

ఇదే భవనంలో ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండు అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు ఒకే ప్రదేశంలో కార్యకలాపాలు ప్రారంభించడం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపార, మీడియా, టెక్ రంగాలలో పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనం అని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.

నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌ను తమ కార్యకలాపాలకు ఎంచుకోవడం అనేది, ఈ నగరం గ్లోబల్ టెక్నాలజీ మీడియా హబ్‌గా రూపాంతరం చెందుతోందనడానికి నిదర్శనం. ఈ సంస్థల రాకతో తెలంగాణలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

2025లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ప్రపంచ స్థాయి కంపెనీలను హైదరాబాద్ వైపు ఆకర్షించడంలో విశేష విజయాన్ని సాధించింది. ఈ ఏడాదిలోనే ఎలీ లిల్లీ, వాన్‌గార్డ్, టీ-మొబైల్, మెక్‌డొనాల్డ్స్,జాన్సన్ & జాన్సన్,కాస్ట్‌కో వంటి 20కి పైగా గ్లోబల్ దిగ్గజ సంస్థలు నగరంలో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు స్థాపించాయి.

నెట్‌ఫ్లిక్స్ ప్రధానంగా ఏ విధమైన కార్యకలాపాలు నిర్వహించబోతోంది?

ఈ కార్యాలయంలో ప్రధానంగా దక్షిణాది తెలుగు భాషతో పాటు ఇతర ప్రాదేశిక భాషల్లోని కంటెంట్స్‌ (వీడియో/స్ట్రీమింగ్) తయారీ, పోస్ట్-ప్రొడక్షన్, టెక్నికల్ ఆపరేషన్స్ పై దృష్టి పెట్టబోతోంది.అలాగే అఫీసు ఇటువు గ్లోబల్ బాక్‌ఎండ్ ఆపరేషన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వర్క్‌ఫ్లోలు, థాలెంట్ హ్యాండ్‌లింగ్ వంటి కార్యకలాపాలకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందువల్ల, నెట్‌ఫ్లిక్స్ యొక్క హైదరాబాద్ కార్యాలయం కేవలం అమ్మకాలు/మార్కెటింగ్ కోసం మాత్రమే కాకుండా కంటెంట్ క్రియేషన్, టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రాదేశిక భాషల విస్తరణ వంటి విభిన్న విభాగాలను సమగ్రంగా చూసేందుకు ఏర్పడినదని చెప్పవచ్చు.

హైదరాబాద్‌‌కు ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ - Tholi Paluku