
హైడ్రా ప్రజావాణికి 41 ఫిర్యాదులు
ప్రజల సౌకర్యం కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు అక్రమంగా కబ్జాలకు గురవుతూ ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారుతున్నాయి. హైడ్రా ప్రజావాణికి సోమవారం మొత్తం 41 ఫిర్యాదులు దాఖలు కాగా, వీటిలో భాగంగా మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల పరిస్థితులు ఉదాహరణగా వెలుగులోకి వచ్చాయి.
ఫిర్యాదుల ప్రకారం, కొందరు అక్రమ కబ్జాదారులు సర్వే నంబర్లను మెనిపులేట్ చేసి, ఖాళీ భూములపై అక్రమంగా సొంతప్రయోజనాల కోసం ఆధారాలు సృష్టిస్తున్నారు. ఒక ఎకరా భూమా కబ్జా చేసినా వందల కోట్ల విలువ చేరుతుంది. కొంతకాలం సామాన్యులను పాత్రధారులుగా ఉపయోగించి, నిజానికి పెద్ద బిజినెస్ ఫెర్ని సృష్టించడం జరుగుతోందని హైడ్రా ప్రజావాణిలో పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.
ఉప్పల్ ఖల్సా సర్వే నంబర్లు 644, 645లో 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 2.5 ఎకరాలను మెట్రోకు కేటాయించినప్పటికీ మిగిలిన భూమిని స్థానికులు ఆక్రమించి వాహన పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. స్థానికులు ఈ భూమిలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేశారు. అలాగే, సర్వే నంబరు 645లో జీహెచ్ ఎంసీ అనుమతితో 3 సెల్లర్లతో 7 అంతస్తుల భవనం నిర్మించడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట, మణికొండ పరిధిలోని ముష్కిన్ చెరువులో కూడా అక్రమ నిర్మాణాలు జరిగాయని. సర్వే నంబర్లు 255, 256, 257లో చెరువు పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమైనప్పటికీ, ఎఫ్‌టీఎల్ నిర్ధారణ లేకపోవడం వలన నిర్మాణాలు పెరుగుతున్నాయని. దీనివల్ల చెరువు విస్తీర్ణం తగ్గడం, వరదలు, నీటి నాణ్యత తగ్గడం, జీవవైవిధ్య నష్టం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని నివాసులు హెచ్చరించారు.
సికింద్రాబాద్ కాంటోన్మెంట్‌లోని చిన్న కమల ప్రాంతంలో నాలాలు ఆక్రమితమయ్యాయి. తిరుమలగిరి వార్డు నెం.7లోని సర్వే నంబరు 17లోని నాలను కొందరు పూర్తిగా ఆక్రమించి, దానిని తమ ప్రాపర్టీగా పేర్కొంటున్నారు. ఫలితంగా వర్షాకాలంలో నీరు బయటకు రాకుండా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని బీహెచ్ఈఎల్ హెచ్‌ఐజీ ఫేజ్-2 ఉషోదయ ఎన్క్లేవ్ ప్రాంతంలోని జీహెచ్‌ఎంసీ పార్క్ కూడా ఆక్రమితమైందన్నారు. నందనం ట్రీ పార్క్ పశ్చిమ భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఇది చట్టవిరుద్ధంగా ప్రజల వినియోగం కోసం కేటాయించిన పార్క్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంగా ఉందని పేర్కొన్నారు.
హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ప్రజలు వెంటనే ఈ అక్రమ కబ్జాలను నివారించాల్సిన అవసరం ఉన్నట్టు మళ్లీ మళ్లీ వెల్లడవుతోంది.
