
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో కలకలం
తెలుగు నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలి అని, ప్రతి స్వేచ్ఛకు కూడా హద్దులు ఉండాలని పేర్కొన్నారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు ప్రముఖులు, మహిళలు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా స్పందించారు .
నటి అనసూయ ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, “ఇది మా బాడీ, మాకు నచ్చినట్టే ఉంటాం. ఎవరు ఏది వేస్తారో అది మాకు నచ్చినట్టే ఉంటాయి” అని చెప్పారు. గాయని చిన్మయి కూడా తీవ్రంగా స్పందించి, “అసభ్య పదాలు ఉపయోగించి మహిళలకు సలహాలు ఇవ్వడం అవసరం లేదు. మహిళలను వస్తువుల్లా చూస్తూ, అగౌరవం కలిగించడం సరైనది కాదు” అని అన్నారు. ‘దండోరా’ ఈవెంట్లో ఉన్న నటుడు నవదీప్ కూడా ఈ వ్యాఖ్యలు అగౌరవపూర్వకంగా ఉన్నాయని, ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
ఈ సందర్భంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ ద్వారా స్పందించారు. “నాకు ఆ వ్యక్తి పూర్తి పేరు తెలియదు, కాబట్టి ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. శివాజీ, మీ ఇంట్లో మహిళలు మిమ్మల్ని తట్టుకునే శక్తి ఉంటే, వారిని మీరు పోలీస్‌లా ఆదేశించవచ్చు. కానీ సమాజంలోని ఇతర మహిళలపై, సినీ పరిశ్రమలో ఉన్నవారిపై మీరు వ్యాఖ్యలు చేయలేరని తెలుసుకోవాలి” అని ఆయన అన్నారు.
అలాగే, మంచు మనోజ్ శివాజీ తరపున మహిళలకు క్షమాపణలు తెలియజేశారు. ఆయన చెప్పినట్లు, మహిళలను వస్తువుల్లా చూడకుండా, వారికి గౌరవం ఇవ్వడం అత్యవసరం అని తెలిపారు.
మొత్తానికి, శివాజీ వ్యాఖ్యలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం వంటి విషయాలను మళ్లీ చర్చకు తెచ్చాయి. ఈ సంఘటనతో సోషల్ మీడియాలో కలకలం మొదలైంది, పలువురు ప్రముఖులు, మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ
నటుడు శివాజీ కూడా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చప్పారు: “నిన్న ‘దండోరా’ ఈవెంట్‌లో నేను కొంత అసభ్య పదాలను ఉపయోగించి కొన్ని మంచి మాటలు చెప్పాను. ఈ మాద్య కాలంలో హీరోయిన్లు బయటకు వెళ్ళినప్పుడు వారి బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో అని మా అమ్మ అంతే తప్ప నేను ఎవ్వరినీ కించపరచాలని కాదు, కానీ ఎవ్వరికైనా మనోభావాలు దెబ్బతింటాయి.మహిళలని దేవతలుగా గౌరవించడం నా విధానం.. ఇండస్ట్రీలో మనోభావాలు దెబ్బతింటే, అలాగే మహిళలు దీన్ని తప్పుగా అనుకోని ఉంటే మీ అందరికీ నా నా హృదయపూర్వక క్షమాపణలమ్మ ” అని అయన అన్నారు.
