Let's talk: editor@tmv.in
హరీష్ రావు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు?: బల్మూరి వెంకట్‌

హరీష్ రావు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు?: బల్మూరి వెంకట్‌

Gaddamidi Naveen
21 జనవరి, 2026

మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలిచిన అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. హరీష్ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడాన్నే అక్రమ అరెస్ట్ చేసినట్టుగా చిత్రీకరించడం సరికాదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఎద్దేవా చేశారు. న్యాయబద్ధంగా విచారణ జరగాలంటూ గతంలో పదే పదే డిమాండ్ చేసినవారే, ఇప్పుడు విచారణ ప్రారంభమవుతే గందరగోళం సృష్టించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయ‌న‌ విమర్శించారు.

ప్రభుత్వం ఎలాంటి ప్రతీకార భావంతో కాకుండా, చట్టబద్ధమైన ప్రక్రియలో భాగంగానే విచారణ చేపడుతోందని వెంకట్ పేర్కొన్నారు. విచారణ సంస్థలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, దానిని స్వాతంత్ర పోరాటంలా లేదా రాజకీయ వేధింపుల్లా చూపడం అనవసరమని వెంకట్‌ ఎద్దేవా చేశారు.

వెంకట్‌ గతాన్ని గుర్తు చేస్తూ, పదేళ్ల క్రితం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ జరిగిన అక్రమ అరెస్టులు, అన్యాయ చర్యలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. అప్పట్లో నిరంకుశంగా వ్యవహరించిన వారే ఇప్పుడు న్యాయవ్యవస్థలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.