
హీరోయిన్కు సీఎం యోగి భరోసా
బాలీవుడ్ హీరోయిన్ దిశపటానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఆమె ఇంటి వద్ద కొంతమంది వరుప కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా హీరోయిన్ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. అయితే ఈ కాల్పులు చేసింది తామేనని గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ప్రకటించారు. దీంతో సీఎం యోగి ఆదిత్య నాథ్ హీరోయిన్ కుటుంబసభ్యులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని దిశ తండ్రి, మాజీ డీఎస్పీ జగదీశ్ పటానీ తెలిపారు. మాకు పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామి ఇచ్చారని వివరించారు. పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు సీఎం యోగి ఇచ్చినట్లు తెలిపారు. ఎస్పీ, ఏడీజీ స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఖుష్బూ చేసిన వ్యాఖ్యలే కారణమా?
దిశా పటానీ సోదరి ఖుష్బూపటానీ ఇటీవల అనిరుద్ధాచార్యపై, ప్రేమానంద్ మహారాజ్ పై లివ్-ఇన్-రిలేషన షిప్ గురించి మాట్లాడారు. దీంతో ఈ నెల
12న బరేలీ పట్టణంలో దిశా పటానీ నివాసం ముందు కాల్పులు జరిపారు.సనాతనధర్మాన్ని విమర్శిస్తే ఊరుకునేది లేదని,ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. భవిష్యత్ లో సాదువులను, సన్యాసులను, మతాన్ని అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. అయితే ఖుష్బూ గతంలో ఆర్మీలో పనిచేసింది. ప్రస్తుతం ఫిట్ నెస్ ట్రైనర్ గా పని చేస్తున్నారు. అయితే దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.
