Let's talk: editor@tmv.in
హిందూ మతంలో సమానత్వం ఉందా?

హిందూ మతంలో సమానత్వం ఉందా?

Pinjari Chand
16 సెప్టెంబర్, 2025

హిందూ మతంలో సమానత్వం ఉంటే వేరే ఏ మతాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య అన్నారు. ప్రజలకు మతం మారే హక్కు ఉంది. వాళ్లని మతం మారమని ఏ పార్టీ కోరదని వ్యాఖ్యనించారు. సోమవారం బెంగుళూరులో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా సమానత్వమే ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉంది అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవం , ఇతర మతాల్లో అసమానత్వం ఉండొచ్చు. కానీ మెజార్టీ మతంలో కులాల మధ్య వివక్ష ఎందుకు? అంటరానితనాన్ని ఎవరు సృష్టించారు అని అడిగారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కులం, మతం పేరుతో సీఎం ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని, అసమానత్వంపై ముస్లింలను సీఎం ప్రశ్నించగలరా? అని విపక్ష నేత అశోక్ విమర్శించారు. ఇటీవల శివాజీనగర్ మెట్రోస్టేషన్ పేరును సెయింట్ మేరీ గా మార్చేందుకు ఆమోదం తెలపడం కూడా వివాదమైంది. దసరా ఉత్సవాలకు రచయిత్రి ముస్తాక్ బానును అతిథిగా ఆహ్వానించడంపై కూడా విపక్ష పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి.

హిందూ మతంలో సమానత్వం ఉందా? - Tholi Paluku