Let's talk: editor@tmv.in
హిందూవులు మాత్రమే ‘గర్భా’ చేయాలి

హిందూవులు మాత్రమే ‘గర్భా’ చేయాలి

Pinjari Chand
24 సెప్టెంబర్, 2025

భోపాల్​ నిర్వహించే గర్బా, దాండియా నృత్యాలకు హిందువులకే అనుమతి ఉందని, గర్బా అనేది సనాతన ధర్మంలో ఓ మత పరమైన ఆచారమని, హిందూ మతాన్ని అనుసరించేవారు మాత్రమే హాజరు కావాలని మంత్రి విశ్వాస్​ సారంగ్​ మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా తమ గుర్తింపు కార్డు తీసుకుని రావాలని సూచించారు. ఇది వినోదం కోసం చేసే ప్రదర్శన కాదని, దుర్గా దేవీ ఆరాధన అని చెప్పారు. హిందూ సంప్రదాయాలను పూర్తిగా అనుసరించేవారు మాత్రమే రావాలని తెలిపారు. సనాతన ధర్మాన్ని అచరించని వారికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.

భద్రతా చర్యలు తీసుకోవాలి

జిల్లాలో జరిగే గర్భా, దాండియా లాంటి సాంస్కృతిక కార్యక్రమాలలో భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ సూచించారు. ప్రోటోకాల్​ ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమ నిర్వహాకులు కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక చర్యలు, అలాగే తప్పనిసరిగా గుర్తింపు దృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. ప్రభుత్వం తెలిపిన గుర్తింపు కార్డు మాత్రమే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుమతించాలని వివరించారు. వేదిక పై నిరంతరం నిఘా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఉత్సవాల సమయంలో ఎటువంటి ఆయుధాలను తీసుకెళ్లరాదని, నిర్వాహాక కమిటీలు గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్​ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ అంశాలను ఎవరైనా పాటించకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నవరాత్రి ఉత్సవాలను సంతోషంగా, వైభవంగా భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

హిందూవులు మాత్రమే ‘గర్భా’ చేయాలి - Tholi Paluku