Let's talk: editor@tmv.in
హైదరాబాద్కు వాన భయం

హైదరాబాద్కు వాన భయం

FL - TRND
15 సెప్టెంబర్, 2025

బాబోయ్.. వర్షం కురిస్తే చిరాకొస్తుంది.. 20నిమిషాల్లో ఇంటికి వెళ్లాల్సిన సమయం కాస్త రెండు గంటలు పట్టేస్తోంది. చినుకు పడితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. పైగా బోనాల సీజన్.. కొన్ని చోట్ల రోడ్లు బ్లాక్ అవుతున్నాయి.. కనీసం ఇన్ఫార్మేషన్ కూడా ఉండడంలేదు. అదే టైమ్లో రెయిన్ జాడించి కొడితే ఎంత నరకముంటుందో కదా.. ఇదంతా అల్రేడి హైదరాబాద్ వాసులు అనుభవించారు.. ఇకపై కూడా ఎక్స్పిరియన్స్ చేయనున్నారు..! ఎందుకంటే ముందుంది అసలైన ముసళ్ల పండగ.. రానున్న రోజుల్లో కూడా వానలు దంచికొట్టనున్నాయట.. కేవలం హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించనుంది. దీనికి బలమైన కారణాలున్నాయి.. ప్రతీ ఏడాది వర్షాలు భీకరంగా మారిపోతున్నాయి.

మనకు కనిపించే ఈ భారీ వానల వెనక అసలు కారణం భూమి వేడెక్కడం. ఇది కేవలం మాటల్లో కాదు. నిజంగానే భూమిపై ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరుగుకుంటూ పోతున్నాయి. సూర్యుడి నుంచి భూమికి వచ్చే వేడి సాధారణంగా కొన్ని మార్గాల్లో తిరిగి అంతరిక్షంలోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు వాతావరణంలో ఎక్కువగా ఉన్న గ్రీన్హౌస్ వాయువులు ఆ వేడిని బయటకి వెళ్లనివ్వకుండా భూమిపైనే పెట్టేస్తున్నాయి. దీని కారణంగా భూమి మునుపటి కన్నా వేడిగా మారిపోతుంది. భూమి వేడిగా మారినప్పుడు సముద్రాలు, నదులు, చెరువులు వేడెక్కిపోతాయి. అప్పుడు ఆ నీటి నుంచి ఆవిరి ఎక్కువగా ఎగిరిపోతుంది. మనం ఎప్పుడూ అనుభవించే తేమ అదే. ఆ తేమ ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారుతుంది. ఈ మేఘాలు ఒక్కచోట ఎక్కువగా పేరుకోని కిందికి వర్షంగా కురుస్తాయి. భూమి వేడి పెరిగితే ఆకాశంలో తేమ కూడా పెరుగుతుంది. తేమ పెరిగితే మేఘాలు ఎక్కువగా ఏర్పడతాయి. మేఘాలు ఒక స్థాయికి మించి దట్టంగా మారినప్పుడు అవి ఒక్కసారిగా కిందకి దూసుకొస్తాయ్. అదే ఉగ్ర వర్షం. అంటే భూమి ఎక్కువగా వేడెక్కినప్పుడు ఆ వేడిని తగ్గించుకోవడానికి ప్రకృతి ఎక్కువగా నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఆ ఆవిరి చివరికి మన మీదే వర్షంగా వస్తుంది. అందుకే వర్షాల సంఖ్య మాత్రమే కాదు తీవ్రత కూడా ఏటేటా పెరుగుతోంది.

ఇప్పుడు కురిసే వర్షాలు మట్టి పరిమళాన్ని తెచ్చే జల్లులుకావు. ఇవి ఒక్కోసారి చిన్న వానలా మొదలై ఓ ఉగ్ర ప్రళయంగా మారుతున్నాయి. కాసేపు పడితే సరిపోతుందనుకునే వాన ఒక్కసారిగా గంటల తరబడి కురుస్తోంది. ఒక గంటలో కురిసే వర్షం మొత్తాన్ని నగరాలు భరించలేకపోతున్నాయి. రోడ్లు జలమయమవుతున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇంట్లోకి నీరు ప్రవహిస్తోంది. రోజులు తరబడి కురిసే వర్షం ఇప్పుడు గంటల వ్యవధిలో జాడిస్తోంది. భూమికి నీరు పీల్చుకునే సమయాన్ని ఇవ్వకుండా విరుచుకుపడుతోంది. దీన్నే ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. ఈ ఫ్లాష్ ఫ్లడ్ ఊహించని విధంగా మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ మార్పులు ఇప్పుడు హైదరాబాద్ వరుకే పరిమితం కాదు. తెలంగాణ గ్రామాల వరకు వర్షం ఓ బెదిరింపు సంకేతంగా మారుతోంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోను కనిపిస్తోంది.

పూర్వం మనకు వాన అంటే పండుగ అనిపించేది. ఇప్పుడు వాన అంటే భయం. ఇంటికి ఎలా వెళ్ళాలి అనే టెన్షన్. స్కూల్స్ మూసేస్తారా అనే ఆలోచన. ఇక ఇదంతా టీజర్ మాత్రమే. భూమి వేడి ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే రానున్న రోజుల్లో వానలు ఇంకా ఉగ్రంగా పడే అవకాశం ఉంది. మన పాత డ్రైనేజీలు, రోడ్లు, ప్లానింగ్ లాంటివి ఈ కొత్త వాతావరణానికి సరిపోవు. అందుకే ఇప్పటినుంచైనా మారాలి. వానలని మనం ఎలాగో ఆపలేం. కానీ అవి వరదల రూపంలా మారకుండా ఉండేలా మనమే చూసుకోవాలి.. లేదంటే ప్రతి వాన మనకు ఒక కొత్త యుద్ధంగా మారుతుంది. ప్రతి చినుకు మన సిస్టమ్కి ఒక పరీక్షగా నిలుస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మనకు ఇప్పుడు వాన అంటే చల్లదనం కాదు. వాన అంటే సవాల్. ఈ సవాళ్లను ఎదుర్కోవడం మన బాధ్యతేనండి!

హైదరాబాద్కు వాన భయం - Tholi Paluku