Let's talk: editor@tmv.in
హడ్కో నిధులు రాగానే బిల్లులన్నీ క్లియర్ చేస్తాం

హడ్కో నిధులు రాగానే బిల్లులన్నీ క్లియర్ చేస్తాం

FL - SIMHCLM
19 సెప్టెంబర్, 2025

రాబోయే రెండు మూడేళ్లలో మున్సిపాల్టీల్లో కొత్తగా 8,57,966 ఇళ్లకు తాగునీటి కొళాయి కనెక్షన్లు అందిస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో సమధానమిచ్చారు. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం పలు పథకాల ద్వారా నిధులు విడుదల చేసినా...గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మున్సిపాల్టీల్లో పనులు మధ్యలో నిలిచిపోయాయన్నారు. అమృత్ 2.0,ఏఐఐబీ,అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అమృత్ 2.0 పథకం అమలుకు కేబినెట్ అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. మైదుకూరు మున్సిపాల్టీకి శ్రీశైలం కుడి కాలువ ద్వారా 0.18 టీఎంసీల నీటిని అందించేందుకు 99.7 కోట్ల అమృత్ నిధులతో పనులు ప్రారంభించనున్నామని వివరించారు.

టిడ్కో ఇళ్లపై మంత్రి ఏమన్నారంటే

2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించిందని, వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచామని, అయితే గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా...ఇళ్లను కూడా పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తవగా...మరో 112 చోట్ల పూర్తిచేయాల్సి ఉందని, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు,ఇళ్ల నిర్మాణం పూర్తికి మొత్తం 6139 కోట్లు కావాలని, అయితే రూ.4500 కోట్లు రుణం ఇవ్వడానికి హడ్కో అంగీకరించిందని తెలిపారు.

హడ్కో నిధులు రాగానే బిల్లులన్నీ క్లియర్ చేస్తాం - Tholi Paluku