Let's talk: editor@tmv.in
"స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" కింద మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన భారతదేశం

"స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" కింద మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన భారతదేశం

Dantu Vijaya Lakshmi Prasanna
2 నవంబర్, 2025

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా నిర్వహించిన "స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" ప్రచారం ద్వారా మూడు ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిళ్లను సాధించింది. నివారణ, మహిళా-కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ పట్ల భారతదేశం యొక్క అపూర్వమైన నిబద్ధతకు ఈ రికార్డులు నిదర్శనంగా నిలిచాయి.

సాధించిన మూడు రికార్డులు వివరాలు:

• ఒక నెలలో ఆరోగ్య సంరక్షణ వేదిక కోసం అత్యధికంగా నమోదు చేసుకున్న వ్యక్తులు: 3,21,49,711 మంది (3.21 కోట్ల కంటే ఎక్కువ).

• ఒక వారంలో ఆన్‌లైన్‌లో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం సైన్ అప్ చేసిన అత్యధిక మంది: 9,94,349 మంది (9.94 లక్షల కంటే ఎక్కువ).

• ఒక వారంలో (రాష్ట్ర స్థాయిలో) ఆన్‌లైన్‌లో కీలక సంకేతాల స్క్రీనింగ్ కోసం సైన్ అప్ చేసిన అత్యధిక మంది: 1,25,406 మంది (1.25 లక్షల కంటే ఎక్కువ).

ప్రధానమంత్రి పోషణ్ మాహ్ సందర్భంగా, 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ఈ దేశవ్యాప్త ప్రచారం జరిగింది. మహిళలు, కౌమార బాలికలు మరియు పిల్లల ఆరోగ్యం, పోషణను మెరుగుపరచడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రభుత్వ వ్యవస్థలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు మరియు సమాజ భాగస్వామ్యం కలయికతో, "ఆరోగ్యవంతమైన మహిళ, సాధికారత కలిగిన కుటుంబం మరియు వికసిత భారత్" నిర్మాణానికి భారతదేశం యొక్క సమిష్టి కృషిని ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు తెలియజేస్తోంది.

ఇది చాలా ప్రశంసనీయం. ఇటువంటి సామూహిక ఉద్యమాలు మన మహిళా సాధికారత ప్రయత్నాలకు బలాన్ని చేకూర్చి, మన నారీ శక్తి జీవితాలపై ఒక పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయని ప్రధాని నరేంద్ర మోడి అబినందనలు తెలుపుతూ ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

"స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" కింద మూడు గిన్నిస్ ప్రపంచ రికార్డులు నెలకొల్పిన భారతదేశం - Tholi Paluku