Let's talk: editor@tmv.in
స్వర్ణ విజేత సాయి ప్రవల్లిక, నీట్ ర్యాంకర్లుకు సీఎం అభినందనలు
స్వర్ణ విజేత సాయి ప్రవల్లిక, నీట్ ర్యాంకర్లుకు సీఎం అభినందనలు
స్వర్ణ విజేత సాయి ప్రవల్లిక, నీట్ ర్యాంకర్లుకు సీఎం అభినందనలు

స్వర్ణ విజేత సాయి ప్రవల్లిక, నీట్ ర్యాంకర్లుకు సీఎం అభినందనలు

Gaddamidi Naveen
19 జులై, 2026

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చైనాలోని ఒర్డోస్‌లో జ‌రిగిన‌ తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక, తెలంగాణ గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో భాగంగా మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో దేశానికి స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త రికార్డు సృష్టించిన సాయి ప్రవల్లికను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో చదువుకుని, ఎలాంటి కార్పొరేట్ కోచింగ్ లేకుండానే ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ గురుకుల విద్యార్థుల ప్రతిభను సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RevanthReddyCMRevanthReddySaiPravallikaAsianU23ChampionshipGoldMedalistTGSWREISGurukulStudentsNEET2026NEETToppersTelanganaEducation
స్వర్ణ విజేత సాయి ప్రవల్లిక, నీట్ ర్యాంకర్లుకు సీఎం అభినందనలు - Tholi Paluku