
స్లో ఓవర్ రేటు కారణంగా టీం ఇండియాకి జరిమానా
శ్రీలంక, పాకిస్థాన్ లపై ఘనవిజయం సాధించి ఊపుమీదున్నభారత మహిళల జట్టుకి డిపెండింగ్ చాంపియన్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా షాక్ ఇచ్చాయి. వరుస ఓటములతో టీం ఉసురుమనిపించింది. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించింది. ఈ నెల 12న విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో నిర్దేశిత సమయంలోపు ఓ ఒవర్ తక్కువగా వేయడంతో ఐసీసీ ప్లేయర్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ వల్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించారు. ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ మిచెల్ పెరెరియా ఈ జరిమానా వేశారు. ఫైన్ కు కారణం టైమ్ అలవెన్స్‌లను పరిగణనలోకి తీసుకున్నా భారత జట్టు ఒక ఓవర్ స్లోగా ఉన్నట్లు గుర్తించారు. ఆన్-ఫీల్డ్ అంపైర్స్ స్యూ రెడ్‌ఫెర్న్, నిమాలి పెరెరా, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ జాక్వెలిన్ విలియమ్స్ ఈ జరిమానాను ప్రతిపాదించారు. భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జరిమానాను అంగీకరించారు.
