Let's talk: editor@tmv.in
స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Gaddamidi Naveen
22 నవంబర్, 2025

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిశారు. ఈ నెల 23 లోపు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్‌ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు.

ఫిరాయింపు ఆరోపణలపై ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం కడియం శ్రీహరి స్పీకర్‌ను ప్రత్యక్షంగా కలిసి వివరణ ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.

శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరోసారి నోటీసులు జారీ చేశారు.నోటీసుల ప్రకారం, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేప‌టిలోపు తమ వివరణలను తెల‌పాలని ఉంది.గత ఆగస్టులో బీఆర్ఎస్‌‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ నోటీసులు జారీ చేశారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్‌ రూపంలో స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు.

ఇక మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న దానం నాగేందర్ త్వరలోనే రాష్ట్రానికి చేరుకోనున్నారు. స్పీకర్‌ను కలిసే అవకాశం ఉన్నప్పటికీ, ఆయన తదుపరి నిర్ణయం ఏదన్నది పెద్ద సందేహంగా మారింది. మరింత సమయం కోరతారా? లేక ఏకకాలంలో సంచలనంగా రాజీనామా చేస్తారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచాయి.ఈ పరిణామాలు అధికార పార్టీ, ప్రతిపక్షాల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఫిరాయింపు ఆరోపణల క్రమంలో, స్పీకర్ తీసుకునే నిర్ణయం మాత్రమే కాక, ఈ ఇద్దరు నేతలు ఎలాంటి రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తారనేదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా మారింది.

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి - Tholi Paluku