
స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకోండి:హైకోర్టు
స్థానిక ఎన్నికలకు తెలంగాణ సన్నద్ధమవుతున్న వేళ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ల అంశం తేలకుండా ఎలా ముందుకు పోతారని ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగా మీరు జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళతామంటే ఎలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని, రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు అనే నిబంధన ఉంది కదా అని కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని ఆదేశించింది. రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అవసరమైతే స్థానిక ఎన్నికలను 10 రోజులు వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదికి వాయిదా వేసింది. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే తీర్పుకు లోబడే వ్యవహారించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
