Let's talk: editor@tmv.in
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 326 గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 326 గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ

Praveen Kumar
25 డిసెంబర్, 2025

స్టాఫ్ సిలెక్షన్ కమిషన్ ఈ ఏడాది 2025–26 కోసం కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 326 గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల, అర్హత పొందిన అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 22, 2025 నుండి ప్రారంభమై, జనవరి 11, 2026 వరకు అందుబాటులో ఉంటాయి.

ఈ ఖాళీలు కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో విభజించబడ్డాయి. వాటిలో సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్ సర్వీసులు 267, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ 37, రైల్వే బోర్డు సెక్రటేరియట్ 8, ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్రాంచ్ 13, ఎన్నికల కమిషన్ 1 ఉన్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఖాళీలు తరువాత ప్రకటించబడతాయి.

దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగాల్లో గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్‌గా నియమితంగా పనిచేస్తున్నవారు మాత్రమే అర్హత పొందుతారు. అనుమతించబడిన సేవా కాలం విభాగాల ఆధారంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సేవా కాలం ,నియామకంలో మినహాయింపులు కూడా వర్తించవచ్చు. ఈ పోస్టుల కోసం షార్ట్హ్యాండ్ నోట్స్ కంప్యూటర్‌లో ట్రాన్స్క్రిప్ట్ చేయగల సామర్థ్యం తప్పనిసరి.

పోస్టులకు వయసు పరిమితి ప్రత్యేకంగా లేదు. అర్హత 01.07.2025 నాటికి అనుమతించబడిన సేవా కాలం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జీతం సంబంధిత విభాగ నియమాల ప్రకారం ఇవ్వబడుతుంది.

ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుంది, ఇందులో జనరల్ అవేర్‌నెస్ , ఇంగ్లీష్ భాషా అర్ధపరచడం పరీక్షించబడుతుంది. తప్పు సమాధానానికి ప్రతి సారి 0.25 మార్కులు తీసివేయబడతాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత పొందినవారిని షార్ట్హ్యాండ్ స్కిల్ టెస్ట్ కు పిలుస్తారు. ఇది హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో నిర్వహించబడుతుంది, దానిలో డిక్టేషన్, కంప్యూటర్ ద్వారా ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. చివరి దశలో అభ్యర్థుల సేవా రికార్డులు ( పరిశీలించబడతాయి, గరిష్టంగా 100 మార్కులు ఇవ్వబడతాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష,షార్ట్హ్యాండ్ టెస్ట్ ,సేవా రికార్డులు మూల్యాంకనం ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తులు రెండు దశల్లో చేయాలి. ముందుగా ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆన్‌లైన్ ఫారం నింపాలి. ఆన్‌లైన్ సమర్పణ తర్వాత, ముద్రిత దరఖాస్తు,అవసరమైన పత్రాలు సంబంధిత విభాగాధిపతి ద్వారా SSC ఉత్తర ప్రాంతీయ కార్యాలయం, న్యూఢిల్లీకు పంపించాలి. భారతదేశంలో అభ్యర్థులు 27 జనవరి 2026 వరకు, విదేశం లేదా అండమాన్ & నికోబార్ / లక్షద్వీప్ నుండి అభ్యర్థులు 3 ఫిబ్రవరి 2026 వరకు సమర్పించాలి.

అభ్యర్థులు ఫోటో, సంతకం, సేవా పత్రాల సమర్పణ వంటి అన్ని సూచనలను పాటించాలి. పరీక్ష కేంద్రం డెల్హీలో మాత్రమే ఉంటుంది, కేంద్రం మార్చమని అభ్యర్థుల అభ్యర్థనలు ఆమోదించబడవు. SSC కు తేదీలు మార్చడం, కేంద్రాలను రద్దు చేయడం లేదా అవసరమైన చర్యలు తీసుకోవడం హక్కు ఉంది. పూర్తి వివరాలు, అర్హతలు, అధికారిక నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు SSC వెబ్‌సైట్ ssc.gov.in ను సందర్శించవచ్చు.