Let's talk: editor@tmv.in
స్కేటర్ దాక్షిణ్యను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

స్కేటర్ దాక్షిణ్యను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Gaddamidi Naveen
11 జులై, 2026

ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్యను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో దాక్షిణ్య మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించిన మంత్రి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.

బిగ్ చాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ భాష మాట్లాడుతూ, దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్‌లో ఏకంగా 35 కిలోమీటర్ల మేర అద్భుత ప్రదర్శన చేసి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించిందని తెలిపారు. దీనితో పాటు ఆమె ఇప్పటికే రెండు జాతీయ అవార్డులను కూడా అందుకుందని వివరించారు. ఈ అభినందన కార్యక్రమంలో క్రీడాకారిణి దాక్షిణ్య తండ్రి సి.హెచ్. సంపత్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
DakshinyaSkatingChampionSilverMedalistAndhraPradeshVijayawadaSkatingRollerSkatingSportsNewsYouthIconIndianSportsSportsAchievementChampion
స్కేటర్ దాక్షిణ్యను అభినందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Tholi Paluku