Let's talk: editor@tmv.in
'సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' కాలేజీ ప్రారంభం

'సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' కాలేజీ ప్రారంభం

Gaddamidi Naveen
7 అక్టోబర్, 2025

రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల భవిష్యత్‌ను మెరుగుపరచే దిశగా, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యాచరణలో భాగంగా ఎర్రగడ్డ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజీని తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సీవోఈ) గా అప్‌గ్రేడ్ చేసింది. ఈ సంస్థను మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. విద్య అనేది ఏ వర్గానికి చెందిన వారినైనా సామాజికంగా ఎదగడానికి, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు తోడ్పడే శక్తివంతమైన సాధనమని మంత్రులు పేర్కొన్నారు. ఈ ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ మాదిరిగా ఏర్పడే కేంద్రాల ద్వారా మైనారిటీ విద్యార్థులు హై లెవెల్ విద్యను పొందగలుగుతారని చెప్పారు. ప్రభుత్వ రంగం సహాయంతో పేదవారు కూడా టాప్ కోచింగ్‌ను పొందగలుగుతారని.. అలాగే విద్యార్థులు వారి జీవితాల్లో స్ధిరత, గౌరవం, అవకాశాలు పెరుగుతాయని మంత్రులు వివేక్, అడ్డూరి పేర్కొన్నారు.

ఏమిటి సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ?

విద్యా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఆధునిక పాఠ్యాంశాలు, టాలెంట్‌ అభివృద్ధికి దోహదపడే కేంద్రం ఇది. ఇవి సాధారణ గురుకులాల కంటే ప్రత్యేకంగా ఉంటాయి. విద్యార్థులు జేఈఈ, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ఇక్కడ డిజిటల్ లెర్నింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు పాఠ్యాంశాల సంబంధిత సబ్జెక్ట్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం కల్పించడం అలాగే నిపుణుల ద్వారా మెంటారింగ్ వంటి అంశాలతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతాయి. అలాగే ఈ సీవోఈల ప్రారంభ లక్ష్యం మైనారిటీ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం,వారిని గ్లోబల్ స్థాయిలో పోటీకి సన్నద్ధం చేయడం,సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో విద్యార్ధులను భాగస్వాములుగా చేయడం జరుగుతుంది.

'సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' కాలేజీ ప్రారంభం - Tholi Paluku