
సెంచరీ కొట్టిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం బలపడేందుకు కూటమిలో ఉన్న బీజేపీ పార్టీ మరింత చురుకుగా ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘సారధ్యం’ యాత్ర తో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంతో పాటు సంఘ్ పరివార్ జిల్లా శ్రేణులు తో కూడా మాటా మంతి కలిపారు. సారధ్యం యాత్ర ముగింపు కార్యక్రమం లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పాల్గొని దిశా నిర్దేశం చేశారు
దీనితో రాష్ట్రంలో బీజేపీ అనేక కార్యక్రమాలకి శ్రీకారం చూడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలని కలుపుకొంటూ ముందుకు వెళ్తోంది. అసలు కులాల వద్దకి బీజేపీ వెళ్లడంపై వ్యూహం ఏంటి? అలాగే దళితులకి దగ్గరవ్వాలని బీజేపీ ఎందుకు కార్యక్రమాలు చేపడుతుంది? బీజేపీ అధ్యక్షులు మాధవ్ బాధ్యత లతో ప్రజాక్షేత్రంలో బీజేపీ ఉండేలా ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందనే అంశాలపై దృష్టి సారించారు.
2024 ఎన్నికల్లో కూటమి గెలుపొందిన అనంతరం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. రాష్ట్ర రాజధాని అమరావతి ని అభివృద్ధి చేయటానికి కూటమి ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతుంది. అమరావతిలో బీజేపీ పాత్ర కనబరిచేలా విశ్వకర్మ విగ్రహం నిర్మించాలని ఒక ప్తిత్తిపాదనని సైతం ప్రభుత్వం ముందుంచి మాధవ్ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చారు. అమరావతిలో బీజేపీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించటం తో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ప్రజాక్షేత్రంలో బీజేపీ మరింత బలపడేందుకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నామినేటెడ్ పదవులు ముఖ్యం కాకుండా ప్రజా ప్రతినిధులుగా ఎదగాలనే ఉద్దేశంతో నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని మాధవ్ పిలుపునిచ్చారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుంటూ వెళ్లేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ అధ్యక్షులు సమావేశాల్లో తెలియచేస్తున్నారు.
బీజేపీలో సరికొత్త వ్యూహం అమలు చేస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కులాల వారిగా బీజేపీ దగ్గరవుతూ కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో సంచార జాతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి దాదాపు 35 సంచార కులాల వారిని ఒక దగ్గరకి తీసుకొచ్చి స్ఫూర్తి పేరుతో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. సంచార జాతుల వారి మనుగడ అలాగే వారు ఎదురుకుంటున్న సమస్యల ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. కేవలం రేషన్ కార్డ్ లకే పరిమితం కాకుండా, వారి అభివృద్ధి అలాగే వారి సమస్యల పరిష్కారానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
విశ్వకర్మల కులస్థులకి బీజేపీ సృష్టి పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనితో 5 రకాల విశ్వ కర్మ కులస్తులు ఎదురుకుంటున్న సమస్యలని తెలుసుకుని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. అమరావతిలో విశ్వకర్మ విగ్రహం నిర్మించాలని ప్రభుత్వానికి బీజేపీ ప్రతిపాదించింది. దీనితో ప్రతి కులాల వద్దకి బీజేపీ గడప గడపకి వెళ్లి తమ మార్క్‌ని కనబరుస్తుంది. కూటమి లో ఉన్న బీజేపీ నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ శాతం కేటాయించేలా ఇలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. రానున్న రోజుల్లో బీజేపీని ఏపీలో ఏ విధంగా బలపరుస్తారో ఒక రోడ్ మ్యాప్ ని మాధవ్ విడుదల చేశారు.
ఈ కారణంగా బీజేపీ అనుబంద సంఘాల కమిటీలకు కూడా జోన్ లో వారి సమావేశాలు నిర్వహించి పని చేసే వారికి బాధ్యత లు ఇవ్వాలని మాధవ్ నిర్ణయించుకున్నారు. గుర్రం జాషువా జయంతి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడమే కాదు ఆయా వర్గాలకు కేవలం బీజేపీ వల్ల నే జాషువా జయంతి ఇంత ఘనంగా జరిగింది అనిపించేలా చేశారు. అదే విధంగా నాయీ బ్రాహ్మణులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నాయీ బ్రాహ్మణులు లేకపోతే భారతీయ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేమని, మీ సేవలు భారతీయ ధర్మానికి ఎంతో అవసరమని వారి హృదయాలను గెలిచే ప్రయత్నం చేశారు.తిరుపతిలో నాయీ బ్రాహ్మణుల సమావేశం ఈ నెల 18వ తేదీన భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు 100 కార్యక్రమాలు పూర్తి చేసి మాధవ్ పార్టీలో ఒక రికార్డు సృష్టించారు.
