
సూర్యాపేట కలెక్టర్ ను కలిసిన మందకృష్ణ మాదిగ
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ని ఆయన కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ, కర్ర రాజేష్ తల్లి కర్ర లలితమ్మ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా సుమారు గంటసేపు కలెక్టర్ కి కర్ల రాజేష్ లాకప్ డెత్ కు సంబంధించిన విషయాలన్ని తెలిపారు.
ప్రధానంగా కర్ల రాజేష్ లాకప్ డెత్ కు ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని తక్షణమే డిస్మిస్ చేయాలని , వెంటనే అరెస్టు చేయాలని..అలాగే ఈ సంఘటనలో భాగస్వాములైన పోలీసులందరిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. ఇప్పటికే సస్పెండ్ అయిన కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగం గారితో పాటు మిగతా పోలీసులను తక్షణమే అరెస్టు చేసి న్యాయం చేయాలన్నారు.
అలాగే నిపుణులైన ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం చేత రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించి, ఈ సంఘటన మీద జ్యుడీషియల్ ఎంక్వయిరీ చేయించాలని కలెక్టర్ ని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
