
సునామీ అవగాహన దినోత్సవం - ప్రకృతి, రణగొణ ధ్వనుల మధ్య మన ప్రాణాలకి భద్రతా పాఠం
తీర ప్రాంతం... ఆ ఉదయమే సముద్రం సాంతంగా కనిపించింది. కానీ కొన్ని నిమిషాలకే అలలు ఉగ్రరూపం దాల్చాయి. సముద్రం వెనక్కి వెళ్ళినట్టయింది… క్షణాల్లోనే భారీ అలలు పరిగెత్తుకొస్తూ తీరాన్నంతా ముంచేశాయి. మనుషులు, ఇళ్లు, చెట్లు, పడవలు, అన్నీ ఆ నీటి వలయంలో కలసిపోయాయి. ఇది సినిమా కాదు… 2004 డిసెంబర్ 26న జరిగిన నిజం. అది భారతదేశ చరిత్రలోనే అత్యంత భయానక సునామీ దుర్ఘటన. ఆ రోజునే మనం తెలుసుకున్నాం… ప్రకృతిని తక్కువ అంచనా వేయడం ఎంత ప్రమాదమో!
అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 5న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మనకు ఒక పాఠం చెబుతుంది. “ప్రకృతి సంకేతాలను పట్టుకో, జాగ్రత్తగా ఉండు, ప్రాణాలను కాపాడుకో !”
సునామీ అంటే ఏమిటి?
"సునామీ" అనే పదం జపనీస్ భాషనుంచి వచ్చింది. “టి ఎస్ యు ” అంటే తీరము, “నా మి” అంటే అల. అంటే తీరాన్ని తాకే భారీ సముద్ర అలలు అన్నమాట. సాధారణ అలలతో పోలిస్తే ఇవి విపరీతంగా శక్తివంతమైనవి. సముద్రం అడుగున భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, లేదా సముద్రపు నేల కదలిక వలన సముద్రపు నీరు ఒక్కసారిగా పైకి లేచి తీరాల వైపుకు పరిగెత్తుతుంది. అదే సునామీ.
2004లో ఇండోనేషియా తీర ప్రాంతంలో 9.1 రిక్టర్ స్కేల్ భూకంపం సంభవించడంతో, ఆ ప్రభావం భారతదేశం తూర్పు తీరంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్-నికోబార్ వరకు విస్తరించింది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుండి ప్రపంచం “సునామీ” అనే పదం అర్థాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంది.
భూకంపాలు – సునామీకి మూలం
ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా తరచుగా భూకంపాలు వస్తున్నాయి. హిమాలయ ప్రాంతం, నేపాల్ సరిహద్దులు, గుజరాత్, అస్సాం, ఆంధ్ర తీర ప్రాంతం వరకు ఈ కదలికల ప్రభావం ఉంటోంది. ఇటీవల జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో నమోదైన భూకంపాల వల్ల వచ్చిన చిన్న సునామీలు స్థానిక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
భూకంపం సముద్రం అడుగున సంభవించినప్పుడు అది సముద్రపు నీటిని ఎగురేస్తుంది. మొదట సముద్రం వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అదే ప్రజలకు ముందస్తు హెచ్చరిక. దాని తర్వాతే వస్తుంది భారీ అల. అప్పుడు తీర ప్రాంత ప్రజలు ఒక్క క్షణం ఆలస్యం చేసినా ప్రాణాల మీద ప్రమాదమే.
2004 సునామీ – మరచిపోలేని దుఃఖ గాథ
ఆ రోజు ఉదయం 8 గంటలకు తమిళనాడు నాగపట్నం, చెన్నై, కేరళ కొల్లం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు క్షణాల్లోనే నీటిమునిగాయి. భారతదేశంలో 12,000 మందికిపైగా ప్రాణాలు పోయాయి. అండమాన్ దీవులలో మొత్తం గ్రామాలే కనుమరుగయ్యాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ ఘటన తర్వాతే భారత ప్రభుత్వం ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు హైదరాబాదులో ఉంది. ఈ సంస్థ ద్వారా సునామీ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసి, సముద్ర అలల కదలికలను నిరంతరం పరిశీలిస్తోంది.
ఇండోనేషియా దేశంలో 2018 సెప్టెంబరు 28న ఒకటి కాదు పలువురు విడతల భూమికంప భద్రాంశం జరిగింది. ఈ భూకంపం (ఉమ్ర 7.5 మ్యాగ్నిట్యూడ్) ముఖ్యంగా పాలo మండలంలోని డోంగాలా ప్రాంతంలో సముద్ర కన్ఫ్స్ వేగంగా ఉత్పత్తి వై వేసింది. ఈ ఘటన వలన సముద్రతీరాల ప్రాంతాల్లో అలలు బ్రతకలేని విధంగా పెరిగి, దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు.
అలాగే జపాన్లో ఈ సమయానికి కాకపోయినా 2025 జూలై 30న రెండు ప్రాంతాలుగా సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఒకటిగా గుర్తుచేయవలసినది. రష్యా కమ్చట్కా పెనిన్సులా తీరంకు సమీపంలో 8.8 మ్యాగ్నిట్యూడ్ కదలిక సంభవించింది, దాని వలన జపాన్ తూర్పు మరియు ఉత్తర తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అలల ఎత్తు 1.3 మీటర్లు వరకు నమోదైంది, ప్రజలను ఇండోనేషియా దేశంలో 2018 సెప్టెంబరు 28న ఒకటి కాదు పలువురు విడతల భూమికంప భద్రాంశం జరిగింది. ఈ భూకంపం (ఉమ్ర 7.5 మ్యాగ్నిట్యూడ్) ముఖ్యంగా పాలం మండలంలోని డోంగాలా ప్రాంతంలో సముద్ర కన్ఫ్స్ వేగంగా ఉత్పత్తి వేసింది. ఈ ఘటన వలన సముద్రతీరాల ప్రాంతాల్లో అలలు వేగంగా పెరిగి, దాదాపు రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితులయ్యారు.
అలాగే జపాన్లో ఈ సమయానికి కాకపోయినా 2025 జూలై 30న రెండు ప్రాంతాలుగా సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఒకటిగా గుర్తుచేయవలసినది. రష్యా కమ్చట్కా పెనిన్సులా తీరంకు సమీపంలో 8.8 మ్యాగ్నిట్యూడ్ కదలిక సంభవించింది, దాని వలన జపాన్ తూర్పు మరియు ఉత్తర తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అలల ఎత్తు 1.3 మీటర్లు వరకు నమోదైంది, ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించడం జరిగింది.
మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రకృతి సంకేతాలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు ఇలా ఉన్నాయి:
• భూకంపం తర్వాత సముద్రం వెనక్కి వెళ్లడం గమనిస్తే వెంటనే ఎత్తయిన ప్రదేశానికి పరుగెత్తాలి.
• తీరానికి దగ్గరగా ఉండే వారు రేడియో, టీవీ, మొబైల్ అలర్ట్స్ ద్వారా వార్తలను గమనించాలి.
• భారీ అలల ఫోటోలు తీసేందుకు తీరానికి వెళ్లకూడదు. చాలామంది ఆసక్తితో వెళ్లి ప్రాణాలు కోల్పోతారు.
• తీర ప్రాంత పాఠశాలల్లో, గ్రామాల్లో సునామీ మాక్ డ్రిల్స్ నిర్వహించడం తప్పనిసరి.
• తీవ్రమైన భూకంపం వచ్చినప్పుడు తీరప్రాంతంలో ఉన్నవారు వెంటనే భద్ర ప్రదేశాలకు వెళ్లాలి, సముద్రాన్ని చూడటానికి బయటకు రాకూడదు.
• ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ఆదారిటీ విడుదల చేసే అలర్ట్స్‌ని గమనించాలి.
• తీవ్ర వర్షాలు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
పాఠశాలలలో అవగాహన - చిన్నవారినుంచే జాగ్రత్త
ప్రతీ తీరప్రాంత పాఠశాలలో విద్యార్థులకు “సునామీ అవగాహన క్లాసులు” ఉండాలి. చిన్నారులకు సునామీ సమయంలో ఎలా రక్షించుకోవాలో చూపే డ్రిల్ ప్రోగ్రామ్స్, అవగాహన పోస్టర్లు, చిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తే భయం తగ్గుతుంది. చిన్నపిల్లలు ఇంట్లో పెద్దలకు కూడా చెబుతారు. “నాన్నా, భూకంపం వచ్చినప్పుడు తీరానికి వెళ్లకూడదు” అని.
ఈ విధంగా ఒక కుటుంబం నుండి మొత్తం గ్రామానికి అవగాహన వ్యాపిస్తుంది.
శాస్త్ర సాంకేతికం మన సహాయకుడు
ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం వలన మనం ముందుగానే హెచ్చరికలు అందుకోగలుగుతున్నాం. సాటిలైట్ వ్యవస్థలు, సముద్ర సెన్సార్లు, జియో ఫోన్లు, అలర్ట్ యాప్‌లు ద్వారా సముద్రపు అలల మార్పులను గమనించి ముందుగానే సమాచారం పంపుతున్నారు. ఐ ఎన్ సి ఓ ఐ ఎస్ ,ఐ ఎమ్ డి ,ఎన్ డి ఎమ్ ఏ వంటి సంస్థలు సమన్వయంతో పని చేస్తున్నాయి. భారతదేశం సునామీ హెచ్చరిక కేంద్రం ద్వారా శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు కూడా సమాచారం అందిస్తుంది. ఇది మన దేశం శాస్త్రవేత్తల కృషికి ప్రతీక.
తీరప్రాంత గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, ఎన్జీవోలు తరచుగా తీరప్రాంతాల్లో ప్రచార యాత్రలు నిర్వహిస్తున్నాయి. పల్లెల్లో పెద్ద బోర్డులు “భూకంపం తరువాత సముద్రం వెనక్కి వెళ్ళితే, వెంటనే ఎత్తయిన ప్రదేశానికి వెళ్ళండి” అనే సందేశాలు కనిపిస్తున్నాయి. ఇలా అవగాహనతోనే ప్రమాదాన్ని తగ్గించగలుగుతాం.
మన బాధ్యత – ప్రకృతితో సఖ్యత
సునామీ, భూకంపం, తుఫాన్, ఇవి ప్రకృతిలో భాగం. మనం వాటిని ఆపలేం కానీ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తీర ప్రాంతాల్లో చెట్లు నాటడం, మంగ్రోవ్ అడవులను రక్షించడం వల్ల అలల ప్రభావం తగ్గుతుంది. సముద్ర తీరాల్లో అతి సమీపంగా కట్టడాలు, హోటళ్ళు నిర్మించడం ఆపితే నష్టాలు తగ్గుతాయి. ప్రకృతిని దోపిడీ చేయడం అంటే మన ప్రాణాలను సవాల్ చేయడం వంటిదే. మన పిల్లల భవిష్యత్తు సురక్షితం కావాలంటే ప్రకృతిని గౌరవించాలి, దాన్ని కాపాడాలి.
సునామీ ఒక విపత్తు కాదు, అది ఒక హెచ్చరిక . “ప్రకృతిని అర్థం చేసుకోండి” అనే సందేశం.
ప్రతి నవంబర్ 5న మనం దీన్ని గుర్తుచేసుకుంటూ, మన భద్రత కోసం, మన తీరప్రాంత ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం అవగాహనతో ముందుకు నడవాలి.
భూకంపాలు వస్తూనే ఉంటాయి, సముద్రం ఎగసిపడుతూనే ఉంటుంది. కానీ మన జాగ్రత్త, మన అవగాహన, మన సైన్స్ సహాయం మనకు రక్షణగా నిలుస్తాయి. ప్రకృతిని శత్రువుగా కాదు, స్నేహితుడిగా చూసినప్పుడే…
మన జీవితాలు, మన తీరాలు సురక్షితంగా ఉంటాయి.
ఇటీవలి కాలంలో సముద్రాల్లో సహజ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాతావరణ మార్పులు, భూకంపాలు, సముద్రపు అడుగున జల తరంగాల తీవ్రత పెరగడం వల్ల సముద్ర జీవాలు అసాధారణంగా ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య అరేబియా సముద్రం, బంగాళాఖాతం మరియు ఇండోనేషియా సమీప ప్రాంతాల్లో సముద్రం లోపల నుండి ఫిష్‌లు, చిన్న చేపల గుంపులు ఒడ్డుకు వచ్చి చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిపుణులు చెబుతున్నట్లు ఇది సముద్ర గర్భంలో ఉష్ణోగ్రత పెరగడం, నీటిలో ఆక్సిజన్ తగ్గిపోవడం, భూకంపాలకు ముందుగా సంభవించే ప్రకంపనల ప్రభావం వల్ల జరుగుతోందని భావిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో భయాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు ఈ మార్పులను సునామీ లేదా పెద్ద భూకంపానికి సంకేతమని భావిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ పరిణామాలను గమనించి సముద్ర జాగ్రత్త బృందాలు, భూకంప సూచన కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు మనం ప్రకృతిని సమతుల్యంగా ఉంచకపోతే ఇలాంటి హెచ్చరికలు భవిష్యత్తులో మరింత తీవ్రమవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ, భద్రతా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.
భూమి మనది కాదు…
ప్రకృతి ప్రతి కదలిక మనకు ఒక హెచ్చరిక. ఆఫ్ఘానిస్తాన్‌లో కూలిపోయిన ఇళ్లు, ఇండోనేషియాలో నీటిలో మునిగిపోయిన గ్రామాలు, జపాన్ తీరాలను తాకిన అలలు ఇవన్నీ మనకు ఒకే మాట చెబుతున్నాయి: ప్రకృతిని మించిపోవాలనే అహంకారం మన జీవనాన్ని ముంచేస్తుంది.
భవిష్యత్తులో ఇలాంటి సునామీలు, భూకంపాలు రాకుండా ఉండాలంటే మనం భూమితో శాంతిగా జీవించడం నేర్చుకోవాలి. చెట్లు నరికి కాంక్రీటు అడవులు కట్టడం, సముద్రానికి దగ్గరగా కట్టడాలు నిర్మించడం, ప్రకృతిని లెక్కచేయకపోవడం. ఇవన్నీ మనమే త్రవ్వుకుంటున్న ప్రమాదపు బావులే. మనం అవగాహన, బాధ్యత, సైన్స్ సహాయం, ప్రకృతి ప్రేమ అనే నాలుగు స్తంభాల మీద జీవనాన్ని నిలపాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచే “ప్రకృతిని గౌరవించు, అది నిన్ను రక్షిస్తుంది” అనే పాఠం నేర్పాలి.
ఎందుకంటే...
