Let's talk: editor@tmv.in
సీఎం రేవంత్ రెడ్డి 'హిందూ వ్యతిరేక' వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు

సీఎం రేవంత్ రెడ్డి 'హిందూ వ్యతిరేక' వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు

Gaddamidi Naveen
4 డిసెంబర్, 2025

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ భావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా కార్యకర్తలు బుధవారం హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు. నాంపల్లి‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ఈ నిరసనలో భారీగా పార్టీ మహిళా, యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవమానకరంగా, హిందూ భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేవ్తెఎం కార్యకర్తలు రహదారిపై కూర్చొని నిరసన తెలిపిన సందర్భంలో, పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అదనపు పోలీసు బలగాలు మోహరించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు డిసెంబరు 3న రాష్ట్రవ్యాప్తంగా విగ్రహ దహనాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు.

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ అందరినీ కలుపుకుని నడుస్తుందని, హిందూ మతంలో మూడు కోట్లా దేవతలు ఉండటంతో ప్రతి భక్తుడు తాను కోరిన దేవతను పూజిస్తారని ఉదాహరణ ఇచ్చారు. “పెళ్లి కాని వారికి హనుమంతుడు, రెండో పెళ్లి చేసుకునేవారికి మరో దేవుడు. కొందరు స్థానిక దేవతలకు తాటిపానకం, మాంసం నైవేద్యంగా పెడతారు, మరికొందరు పప్పు,అన్నం తినే వారు తమ ఇష్టదేవతలను పూజిస్తారు” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్ని రకాల వ్యక్తులను తమ వెంట తీసుకెళ్తుందని. దేవుళ్లపై ఏకాభిప్రాయం తీసుకురాలేనప్పుడు, రాజకీయ నాయకులు డీసీసీ అధ్యక్షుల విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరదని నేను అనుకుంటున్నాను అని ఆయన అన్నారు.కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నియామకంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి నెలకొందని వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు వచ్చినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి 'హిందూ వ్యతిరేక' వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు - Tholi Paluku